ఆర్థిక రచయిత, వ్యాపారవేత్త రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) ఈ సంవత్సరం తన థాంక్స్ గివింగ్ సందేశాన్ని తొలగింపులను ఎదుర్కొంటున్న అమెరికన్ ఉద్యోగుల పట్ల కరుణను వ్యక్తం చేయడానికి ఉపయోగించారు. అదే సమయంలో ఉద్యోగం కంటే కూడా వ్యాపారం, వ్యవస్థాపకత ప్రాముఖ్యతపై తన దీర్ఘకాల నమ్మకాన్ని పునరుద్ఘాటించారు.
సోషల్ మీడియాలో పంచుకున్న ఒక పోస్ట్లో, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత ఉపాధి కన్సల్టెన్సీ ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్ నుంచి వచ్చిన తాజా డేటాను ఉదహరించారు. ఇది 1,53,000 మంది అమెరికన్ ఉద్యోగులు ఈ హాలిడే సీజన్లో (క్రిస్మస్ వేళ) ఉద్యోగాలు కోల్పోతారని నివేదించింది.
‘నా హృదయం ముక్కలైంది. ఎవరి జీవితంలోనైనా కొన్ని సంఘటనలు ఉద్యోగం కోల్పోవడం కంటే కూడా బాధాకరంగా ఉంటాయి’ అని రాసుకొచ్చిన కియోసాకి ఎంటర్ప్రెన్యూర్గా తన సొంత అనుభవాన్ని ప్రతిబింబించారు. తానెప్పుడూ తొలగింపునకు గురికాలేదని పేర్కొన్నారు. ఏదేమైనా, సాంప్రదాయ ఉపాధిపై ఆధారపడే వారిపై ఉద్యోగం కోల్పోవడం.. భావోద్వేగ, ఆర్థిక ప్రభావాన్ని చూపుతుందని ఆయన అంగీకరించారు.
"నేను ఎంటర్ప్రెన్యూర్ను కాబట్టి నన్ను ఎప్పుడూ, ఎవరూ తొలగించలేరు.ఎందుకంటే నేను ఉద్యోగిని కాదు" అన్నారు కియోసాకి. అయితే తన స్నేహితుల్లో కొందరి తండ్రులు ఉద్యోగాలు కోల్పోయారని, ఇది కుటుంబం మొత్తాన్ని బాధించే అంశమని పేర్కొన్నారు.
ఆర్థిక స్వాతంత్య్రం ఆవశ్యతను ఎత్తిచూపుతూనే ఆనందంగా ఉండాల్సిన పండుగ వేళ ఉద్యోగాలు కోల్పోయినవారికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. అటువంటివారి పట్ల మరింత కరుణ, దయ కలిగిఉండాలని, అవసరమైతే వారి బాధ్యతను తీసుకోవాలని తన సందేశంలో సూచించారు.
HAPPY THANKSGIVING “You’re Fired.”
Employment Consultant: Challenger Grey and Christmas just announced 153,000 American employees are going to be fired.
Breaks my heart. Few events in anyone’s life are more painful than being fired.
I’ve never been fired because I am an…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 8, 2025


