గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తిక మాసం, తిథి: బ.విదియ ప.2.29 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: కృత్తిక ఉ.7.00 వరకు, తదుపరి రోహిణి తె.5.19 వరకు (తెల్లవారితే శనివారం), వర్జ్యం: రా.9.52 నుండి 11.21 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.22 నుండి 9.07 వరకు, తదుపరి ప.12.06,
నుండి 12.51 వరకు, అమృత ఘడియలు: రా.2.20 నుండి 3.51 వరకు.
సూర్యోదయం : 6.04
సూర్యాస్తమయం : 5.24
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం.. సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. కొత్త సమస్యలు ఎదురుకావచ్చు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.
వృషభం.... ముఖ్య వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. ఉద్యోగయోగం. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.
మిథునం... వ్యవహారాలలో ఆటంకాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలు రద్దు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో మార్పులు.
కర్కాటకం... కొత్త మిత్రుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు ఆదాయం. ఆకస్మిక ధనలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో పురోభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
సింహం..... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి.
కన్య.... ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. పనుల్లో ప్రతిబంధకాలు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలలో లేనిపోని చిక్కులు. ఉద్యోగాలలో వివాదాలు.
తుల... ఆర్థిక ఇబ్బందులు. ముఖ్య వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితి.
వృశ్చికం.... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ముఖ్యమైన పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ముందడుగు.
ధనుస్సు..... సన్నిహితులతో సఖ్యత. వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యవహారాలలో పురోగతి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మకరం...... శ్రమ పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. విద్యార్థుల ప్రయత్నాలు ముందుకు సాగవు. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
కుంభం.... ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకోని ప్రయాణాలు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. ఆరోగ్యభంగం. పనుల్లో జాప్యం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు.
మీనం.... పూర్వపు మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఆహ్వానాలు అందుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రశంసలు.


