శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం,
తిథి: బ.చతుర్దశి తె.4.24 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి అమావాస్య,
నక్షత్రం: అనూరాధ రా.8.21 వరకు తదుపరి జ్యేష్ఠ,
వర్జ్యం: రా.2.33 నుండి 4.19 వరకు,
దుర్ముహూర్తం: ఉ.10.06 నుండి 10.50 వరకు, తదుపరి ప.2.29 నుండి 3.13 వరకు,
అమృత ఘడియలు: ఉ.8.46 నుండి 10.35 వరకు,
సూర్యోదయం : 6.28
సూర్యాస్తమయం : 5.25
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
గ్రహఫలాలు........గురువారం, 18.12.25
మేషం....కొన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుంటారు. దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. కుటుంబసభ్యులతో విభేదిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహవంతంగా ఉంటుంది.
వృషభం....కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. బంధువర్గంతో వివాదాలు తీరతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనంగా ఉంటాయి.
మిథునం....నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.
కర్కాటకం...ఆదాయానికి మించి ఖర్చులు. కుటుంబంలో విభేదాలు. ప్రయాణాలు చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. బంధువుల తాకిడి. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
సింహం....ఎంతగా కష్టపడినా ఫలితం ఉండదు. ఆస్తి వివాదాలు. బందువర్గంతో తగాదాలు. స్వల్ప అస్వస్థత. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. దేవాలయ దర్శనాలు.
కన్య....కార్యజయం. శుభవర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. అరుదైన సన్మానాలు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
తుల...ఆదాయం కంటే ఖర్చులు అధికం. కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప శారీరక రుగ్మతలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
వృశ్చికం.....దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలం. కార్యజయం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
ధనుస్సు...రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్నేహితులతో విభేదిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదా.
మకరం...కొత్త కార్యక్రమాలు చేపడతారు. శుభకార్యాల ప్రస్తావన. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వాహనసౌఖ్యం. వ్యాపార, ఉద్యోగాలు సంతప్తికరంగా ఉంటాయి. దేవాలయాలు సందర్శిస్తారు.
కుంభం.... రావలసిన సొమ్ము అందుతుంది. కార్యజయం. శుభవర్తమానాలు. కాంట్రాక్టులు దక్కుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
మీనం...కుటుంబసభ్యులతో విభేదిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో మాటపట్టింపులు. ఆస్తి వివాదాలు. ఇంటి నిర్మాణాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.


