ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Horoscope Telugu 21-12-25 To 27-12-2025 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Dec 21 2025 5:41 AM | Updated on Dec 21 2025 7:36 AM

Weekly Horoscope Telugu 21-12-25 To 27-12-2025

మేషం...
కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి.
సమస్యల నుంచి బయటపడతారు. స్థలాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. రెండుమూడు విధాలుగా ధనప్రాప్తి ఉండవచ్చు.  సోదరులు , సోదరీలతో విభేదాలు తొలగుతాయి. మీరు ఊహించినట్లుగానే నిర్ణయాలు జరిగి  సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలలో కొత్త  పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు వివాదాలు తీరతాయి. వారం ప్రారంభంలో ఖర్చులు అధికం. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. పసుపు, ఎరుపు రంగులు.  శివపంచాక్షరి పఠించండి.

వృషభం..
ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆలోచనలు కలసివస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. కీలక సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. పనులు చకచకా సాగి విజయాలు సాధిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధనలాభాలు కలుగుతాయి.   కుటుంబంలో ఆదరణ పొందుతారు.  వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో  బాధ్యతలు సమర్థతతో పూర్తి చేస్తారు. కళాకారులు, రాజకీయవేత్తలకు మరిన్ని విజయాలు చేకూరుతాయి. వారం ప్రారంభంలో ప్రయాణాలు రద్దు. శ్రమాధిక్యం. బంధువులతో వైరం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. గణేశాష్టకం పఠించండి.

మిథునం...
సమస్యలు ఎట్టకేలకు పరిష్కారవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సమస్య ఎదురైనా  నేర్పుగా పరిష్కరించకుంటారు. వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలంగా మార్చుకుంటారు. ఊహించని రీతిలో ధనప్రాప్తి కలుగుతుంది. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది.

అందరితోనూ సఖ్యతతో మెలగి కలసిమెలసి ముందుకు సాగుతారు. వ్యాపారాలులో లాభాలు తథ్యం. అనుకున్న  విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో  మంచి పేరు సంపాదిస్తారు. రాజకీయ,పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. అనారోగ్యం. పసుపు, నీలం రంగులు. శివాష్టకం పఠించండి.

కర్కాటకం...
పనులలో పురోగతి కనిపిస్తుంది. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పోటీపరీక్షలలో విజయం చేకూరుతుంది. ఊహించని రీతిలో కొందరు ఆదుకుంటారు. ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయి. కుటుంబంలో మీ అభిప్రాయాలను మన్నిస్తారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు లభిస్తాయి.  కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో వృథా ఖర్చులు. ఇంటాబయటా సమస్యలు. మానసిక ఆందోళన. ఎరుపు, తెలుపు రంగులు. ఆంజనేయస్వామిని పూజించండి.

సింహం...
చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు.. కార్యక్రమాలు నిదానించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక లావాదేవీలు మొదట్లో కొంత ఇబ్బంది అనిపించినా క్రమేపీ పుంజుకుంటారు. అంచనాలు నిజమై సంతోషంగా గడుపుతారు. ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు.  వ్యాపారాలలో క్రమేపీ లాభాలు దక్కుతాయి. భాగస్వాములు సమకూరతారు.  ఉద్యోగాలలో ఉన్నతా«ధికారుల తీరు ఆకట్టుకుంటుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో వ్యయవ్రయాసలు. మిత్రులతో విరోధాలు. దూరప్రయాణాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కన్య....
కార్యక్రమాలలో అవాంతరాలు తొలగి ముందుకు సాగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ధనప్రాప్తి. అందరిలోనూ గౌరవం పొందుతారు. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. భాగస్వాములతో వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఉద్యోగాలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందడుగు వేస్తారు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో ప్రయాణాలలో అటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు. గులాబీ, ఎరుపు రంగులు.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి..

తుల...
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి.
పరిస్థితులు అనుకూలించడంతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. సొమ్ముకు లోటు లేకుండా గడుస్తుంది. ఊహించిన విధంగానే బంధువులు చేయూతనిస్తారు. మీపై వచ్చిన అపోహలు తొలగుతాయి. వ్యాపారాలలో అనుకున్న విధంగా  విస్తరిస్తారు. . ఉద్యోగాలలో మార్పులు జరిగే వీలుంది. కళాకారులు మరింత ఉత్సాహంతో సాగుతారు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. గులాబీ, తెలుపు రంగులు.
దుర్గాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం...
కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. వాహనాలు విషయంలో నిర్లక్ష్యం వద్దు.
తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. అప్పులు చేస్తారు. కొంత సొమ్ము చేజారే వీలుంది, అకారణంగా కుటుంబసభ్యులు మీపై నెపాలు వేస్తునే ఉంటారు.   వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణలో శ్రమ మరింత పెరుగుతుంది. రాజకీయవర్గాలకు కొంత గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవర్తమానాలు. స్వల్ప ధనలాభం. ప్రముఖ వ్యక్తుల పరిచయం. నేరేడు, ఆకుపచ్చ రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

ధనుస్సు..
మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వివాదాలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు ఉద్యోగాలు దక్కించుకుంటారు. కష్టాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. నూతన వ్యక్తులు పరిచయమవుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. రుణాలు చాలవరకూ తీరి ఊరట చెందుతారు.వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. పెట్టుబడులకు లోటు లేకుండా గడుస్తుంది. ఉద్యోగ విధి నిర్వహణలో సామర్థ్యాన్ని చాటుకుంటారు. ఉన్నత పోస్టులు దక్కించుకుంటారు. కళాకారులకు పురస్కారాలు అందుతాయి. వారం చివరిలో మానసిక ఆందోళన ఖర్చులు పెరుగుతాయి కుటుంబంలో చికాకులు. పసుపు, గోధుమరంగులు.. అంగారక స్తోత్రాలు పఠించండి.

మకరం..
పనులు చకచకా  సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు అందుతాయి. వాహనాలు, స్థలాలు కొంటారు.  రుణఒత్తిడులు తొలగుతాయి. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు రాగలదు.  వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. పెట్టుబడులకు లోటు ఉండదు.  ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు.పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. నీలం, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం..
ఎటువంటి సమస్యనైనా తేలిగ్గా పరిష్కరించుకుంటారు.  పలుకుబడి కలిగిన వారి పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగాలు దక్కించుకుంటారు.  సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. రావలసిన సొమ్ములు అందుతాయి. కొన్ని నిర్ణయాలు బంధువులను మెప్పిస్తాయి.  వ్యాపారాలలో క్రమేపీ లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు అందుకుంటారు. కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగాలలో గుర్తింపు పొందుతారు. ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.  వారం చివరిలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. నలుపు, గులాబీ రంగులు. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి.

మీనం...
ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఇంటి నిర్మాణాల్లో అవరోధాలు అధిగమిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. కార్యజయంతో ఉత్సాహంగా సాగుతారు. రావలసిన సొమ్ము సమయానికి అందుతుంది.  సోదరులతో వివాదాలు కొంత సర్దుకుంటాయి. వ్యాపారాల మరింతగా  విస్తరిస్తారు. లాభాలు అందుతాయి.  ఉద్యోగాల మార్పులు జరిగే వీలుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో లేనిపోని ఖర్చులు.. ఆప్తులతో వివాదాలు. ప్రయాణాల్లో అవాంతరాలు. గోధుమ, ఎరుపురంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement