మేషం...
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు అందరిచేత ప్రశంసలు అందుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు చిక్కులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. నేరేడు, నీలం రంగులు. గణేశాష్టకం పఠించండి.
వృషభం....
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు రాగలవు. కళారంగం వారిని విజయాలు వరిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. గులాబీ, పసుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.
మిథునం....
ఆర్థిక విషయాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. మిత్రులతో వివాదాలు ఏర్పడవచ్చు. కొన్ని విషయాలలో చికాకులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. కష్టమే తప్ప ఫలితం అంతగా కనిపించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు కాస్త గందరగోళం కలిగించవచ్చు. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. క్రీడాకారులు, రాజకీయవర్గాలకు ఒత్తిడులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, నేరేడు రంగులు. శివస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం....
పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వైద్యులు, కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
సింహం....
బంధువులతో మరింత సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. స్థిరాస్థి వృద్ధి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు కొత్త పోస్టులు రావచ్చు.. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో మిత్రులతో కలహాలు. ఇంటాబయటా ఒత్తిడులు. నేరేడు,తెలుపు రంగులు. గణేశ్‌ను పూజించండి.
కన్య....
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, ఆభరణాలు కొంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్య వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు విశేష గుర్తింపు రాగలదు. వారం మధ్యలో ధనవ్యయం. బంధువిరోధాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.
తుల....
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు లేదా ఇంక్రిమెంట్లు రావచ్చు. కళాకారులకు నూతనోత్సాహం. వారం చివరిలో వివాదాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.
వృశ్చికం....
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. మిత్రులు, కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణాలు చేపడతారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. తీర్థయాత్రలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగులకు ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది. కళాకారులకు పురస్కారాలు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. గణేశ్‌ను పూజించండి.
ధనుస్సు...
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు, విద్యార్థులకు ఆశలు నెరవేరతాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ¬ఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఖర్చులు అధికం. శ్రమాధిక్యం. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. శివాష్టకం పఠించండి.
మకరం...
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి. కొత్త విషయాలు గ్రహిస్తారు. బంధువర్గంతో చర్చలు సాగిస్తారు.సందడిగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు మరింతగా లాభించవచ్చు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. అనారోగ్యం. మిత్రులతో వివాదాలు. గులాబీ, లేత నీలం రంగులు. శివాష్టకం పఠించండి.
కుంభం...
ముఖ్య వ్యవహారాలు అనుకున్నరీతిలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనయోగం. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులు సమర్థతను నిరూపించుకుంటారు. వైద్యులు,రాజకీయవేత్తలకు మంచి గుర్తింపు లభిస్తుంది.. వారం చివరిలో దూరప్రయాణాలు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. ఎరుపు, పసుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.
మీనం....
కొత్త పనులను జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాక్చాతుర్యంతో ఎదుటవారిని ఆకట్టుకుంటారు. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళారంగం వారు, సాంకేతిక నిపుణులకు అన్ని విధాలుగా అనుకూల కాలం.. వారం చివరిలో కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. నీలం, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


