మేషం...
సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. కుటుంబసభ్యుల సూచనలు, సలహాల మేరకు ముందుకు సాగుతారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురైనా సర్దుబాటు చేసుకుంటారు. ముఖ్యకార్యక్రమాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు దక్కుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు ప్రజ్ఞాపాటవాలు చాటుకుంటారు. వారం ప్రారంభంలో ఖర్చులు పెరుగుతాయి. శారీరక రుగ్మతలు బా«ధిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. పసుపు,ఎరుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
వృషభం..
ముఖ్యమైన కార్యక్రమాలు కొంత నిదానించినా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కొన్ని సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కవచ్చు. ఆస్తి వ్యవహారాలలో తగాదాలు పరిష్కారమవుతాయి. దూరపు బంధువులను కలుసుకుని కుటుంబ విషయాలు చర్చిస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు నేర్పుగా లాభాలబాట పడతారు. ఉద్యోగులు విధి నిర్వహణలో అవరోధాలు అధిగమిస్తారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలు సత్తా నిరూపించుకుంటారు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.
మిథునం...
మధ్యలో నిలిచిపోయిన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేస్తారు. మీపై వచ్చిన అపవాదులు, విమర్శలు తొలగుతాయి. పెద్దల సలహాలు పాటిస్తూ ముందుకు సాగుతారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. భూములకు సంబంధించి అగ్రిమెంట్లు చేసుకుంటారు. నిరుద్యోగుల ఆశలు ఫలించే సమయం. గృహోపకరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలకు ప్రణాళిక రూపొందిస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో మనస్పర్థలు తొలగుతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో సమర్థత చాటుకుంటారు. కళాకారులు, క్రీడాకారులకు అవకాశాలు మరింత పెరుగుతాయి. వారం చివరిలో అనుకోని ఖర్చులు. కుటుంబంలో సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.
కర్కాటకం...
ముఖ్య కార్యక్రమాలు అనుకున్న రీతిలో కొనసాగిస్తారు. నిర్ణయాలలో పొరపాట్లు సరిద్దుకుంటారు. ఆదాయానికి లోటు ఉండదు, విలాసజీవనానికి అధిక మొత్తం ఖర్చు చేస్తారు. ధార్మిక, సమాజ సేవాకార్యక్రమాలలో కీలకపాత్ర వహిస్తారు. స్థిరాస్తికి సంబంధించి అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారులు నిదానం పాటించడం ద్వారా లాభాలు గడిస్తారు. ఉద్యోగులు అనుకూల పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో మనశ్శాంతి లోపం. బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. పసుపు, నీలం రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
సింహం....
ఇంటిలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సోదరులు, స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు.. చిరకాల ప్రత్యర్థులు సైతం చేయూతనందించడం విశేషం. ఆదాయం కొంత పెరిగి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు. . వివాహయత్నాలు అనుకూలిస్తాయి. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. వారసత్వ ఆస్తి దక్కే అవకాశం. ఇంటి నిర్మాణాలు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. వ్యాపారులు లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు తీసుకునే నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి.వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. విశ్రాంతిలోపంతో అనారోగ్యం.. కుటుంబంలో సమస్యలు.హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
కన్య...
ప్రయాణాలలో నూతన పరిచయాలు. దూరపు బంధువులు మరింత ఆప్యాయత చూపుతారు. ఒక చిత్రమైన సంఘటన ఎదురుకావచ్చు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కార్యక్రమాలు సమయానుసారం పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. కనిపించకుండా పోయిన డాక్యుమెంట్లు సురక్షితంగా చేతికందుతాయి. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కివస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. విద్యార్థులు నూతన విద్యావకాశాలు పొందుతారు. వ్యాపారులకు అధిక మొత్తం లాభాలు దక్కవచ్చు. ఉద్యోగులు విధినిర్వహణలో అంకితభావంతో పనిచేస్తారు. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో బంధువిరోధాలు. శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.
తుల...
ఆదాయం కొంత మెరుగ్గా ఉన్నా అవసరాలరీత్యా అప్పులు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ప్రత్యర్థులతో రాజీమార్గం అనుసరిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు∙ఆలస్యమైనా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి ఒక కీలక సమాచారం రాగలదు. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖులు సహాయసహకారాలు అందిస్తారు. వ్యాపారులు సత్తా చాటుకుని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణ సాఫీగా కొనసాగుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఎదురుచూడని అవకాశాలు ఆశ్చర్యపరుస్తాయి. వారం చివరిలో ఊహించని ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది. దూరప్రయాణాలు. గణేశాష్టకం పఠించండి.
వృశ్చికం....
నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరవచ్చు. ఆదాయం మరింత పెరుగుతుంది. బంధువులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుని ఒడ్డున పడతారు. కాంట్రాక్టర్లు అనుకున్న పనులు సాధిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. మీపట్ల ఆప్తులు మరింత అభిమానం చూపడం విశేషం. వ్యాపారులు పెట్టుబడుల యత్నాలు ముమ్మరం చేసి సఫలమవుతారు. ఉద్యోగులు సహచరులతో పోటీపడి సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులు విశేష గుర్తింపు పొందుతారు. వారం ప్రారంభంలో బంధువులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ఖర్చులు. గులాబీ, పసుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు...
ఆదాయానికి లోటు రాకుండా గడుపుతారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో కొత్త కార్యక్రమాలు చేపడతారు. దేవాలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు విదేశీ విద్యావకాశాలు దక్కవచ్చు. ఆస్తి వ్యవహారాలలో బంధువుల నుంచి ఒత్తిళ్లు తొలగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి సమస్యలు తగ్గుతాయి. పారిశ్రామిక,రాజకీయవేత్తలు విదేశీ పర్యటనలు జరుపుతారు. ప్రారంభంలో లేనిపోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఇంటాబయటా చికాకులు. తెలుపు, నీలం రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
మకరం...
చేపట్టిన కార్యక్రమాలను కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. ఇతరులకు కొంత సహాయం అందించి సేవాభావం చాటుకుంటారు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు మరింత ఉత్సాహం. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త వ్యక్తుల పరిచయం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం అనుకున్న రీతిలో లభిస్తుంది. బంధువర్గంతో ముఖ్య విషయాలపై చర్చలు జరుపుతారు. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగులకు ఊహించని మార్పులు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత అనుకూల పరిస్థితులు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. మిత్రుల నుండి సమస్యలు. ఆరోగ్యభంగం. నలుపు, ఆకుపచ్చ రంగులు. కాలభైరవాష్టకం పఠించండి..
కుంభం...
శ్రమానంతరం ముఖ్య కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆదాయం తగ్గి అవసరాలకు అప్పు చేయాల్సివస్తుంది. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. స్థిరాస్తుల వ్యవహారాలలో వివాదాలు రావచ్చు. . క్రీడాకారులు కొంత నిరాశ చెందుతారు. సోదరులతో విభేదాలు ఏర్పడతాయి. సమయస్ఫూర్తి, నేర్పుతో వ్యవహరించడం ఉత్తమం. విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. కాంట్రాక్టర్లు అనుకున్న పనులు దక్కించుకుంటారు. శ్రేయోభిలాషుల నుంచి పిలుపు రావచ్చు. ఉద్యోగ, ఉపాధి ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు లాభనష్టాలు సమానస్థాయిలో ఉంటాయి. ఉద్యోగులు బాధ్యతలు పెరిగినా దీక్షతో పూర్తి చేస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు వ్యూహాత్మకంగా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. వారం మధ్యలో శుభవర్తమానాలు. వాహనయోగం. ఆకస్మిక ధనలాభం. పసుపు, నేరేడు రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.
మీనం...
కొన్ని ముఖ్య కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆదాయం కొంత నిరాశ పర్చినా ఏదోవిధంగా సొమ్ముఅందుతుంది. విచిత్ర పరిస్థితులు ఎదురుకావచ్చు. మీపట్ల విముఖంగా ఉన్న వారే దగ్గరకు వస్తారు. సోదరులు, సోదరీల ప్రేమానురాగాలు పొందుతారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. ఇంటిలో హడావిడి,సందడి వాతావరణం ఉంటుంది. విలాసజీవనం సాగిస్తారు. ఇంటి నిర్మాణాలు, కొనుగోలుM యత్నాలు సఫలం. తీర్థయాత్రలు జరుపుతారు. వ్యాపారులు మరింత లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు విధి నిర్వహణలో అధికారుల మన్ననలు పొందుతారు. పారిశ్రామికవేత్తలు,కళాకారులు అంచనాలు నిజం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. వారం మధ్యలో వృథా ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది. ఆరోగ్యం మందగిస్తుంది. గులాబీ, పసుపు రంగులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.


