ఈ రాశి వారు విలువైన వస్తువులు కొంటారు.. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. | Rasi Phalalu: Daily Horoscope On 17-01-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు విలువైన వస్తువులు కొంటారు.. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

Jan 17 2026 3:45 AM | Updated on Jan 17 2026 3:45 AM

Rasi Phalalu: Daily Horoscope On 17-01-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: బ.చతుర్దశి రా.12.07 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: మూల ఉ.8.37 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ఉ.6.53 నుండి 8.38 వరకు, తదుపరి రా.7.02 నుండి 8.46 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.38 నుండి 8.07 వరకు, అమృత ఘడియలు: తె.5.27 నుండి 7.11 వరకు, ముక్కనుమ

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం    :  5.42
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: పనుల్లో ప్రతిబంధకాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. బంధువులు, స్నేహితులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. మానసిక అశాంతి. దూరప్రయాణాలు.

వృషభం: రాబడికి మించి ఖర్చులు. బందువర్గంతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అంచనాలు తప్పుతాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మిథునం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార,ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కర్కాటకం: పలుకుబడి పెరుగుతుంది. స్నేహితులతో వివాదాలు తీరతాయి. భూలాభాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు.

సింహం: ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్య,కుటుంబసమస్యలు. పనుల్లో అవరోధాలు. వ్యాపారాలు ఉద్యోగాలలో చికాకులు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అప్పులు చేస్తారు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యసూచనలు. వ్యాపార , ఉద్యోగాలలో చిక్కులు.కొందరికి స్థానమార్పులు. నాయకులకు ఒత్తిడులు.

తుల: ఉద్యోగయత్నాలు సానుకూలం. విలువైన వస్తువులు కొంటారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. మీ సత్తా చాటుకుంటారు. కళాకారులకు సన్మానాలు.

వృశ్చికం: ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వృథా ఖర్చులు. స్నేహితులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. దేవాలయ దర్శనాలు.

ధనుస్సు: ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం: వ్యవహారాలలో చికాకులు. దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. చోరభయం. అంచనాలు తారుమారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. సోదరులతో కలహాలు.

కుంభం: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవం. కీలక నిర్ణయాలు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. భూ, గహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. అందరిలోనూ గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. భూ, గృహయోగాలు. కళాకారులకు సన్మానాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement