శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం,
తిథి: అమావాస్య తె.6.27 వరకు (తెల్లవారితే శనివారం) తదుపరి పుష్య శుద్ధ పాడ్యమి,
నక్షత్రం: జ్యేష్ఠ రా.10.56 వరకు, తదుపరి మూల,
వర్జ్యం: లేదు,
దుర్ముహూర్తం: ఉ.8.39 నుండి 9.23 వరకు, తదుపరి ప.12.19 నుండి 1.03 వరకు,
అమృత ఘడియలు: ఉ.1.06 నుండి 2.54 వరకు.
సూర్యోదయం : 6.28
సూర్యాస్తమయం : 5.25
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
గ్రహఫలాలు
మేషం....ఆదాయం తగ్గుతుంది. దూరప్రయాణాలు. అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్నేహితులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.
వృషభం....కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపార , ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వస్తులాభాలు.
మిథునం...నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. చర్చలు సఫలం. దేవాయల దర్శనాలు. పరిచయాలు పెరుగుతాయి.
కర్కాటకం....స్నేహితులు, కుటుంబసభ్యులతో విభేదాలు. ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
సింహం...కార్యక్రమాలలో ఆటంకాలు. వృథాఖర్చులు. ఆస్తి వివాదాలు పరిష్కారం. ప్రత్యర్థులు పెరుగుతారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని అవరో«ధాలు.
కన్య... కృషి ఫలిస్తుంది. ప్రముఖ వ్యక్తులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. సోదరుల నుంచి శుభవర్తమానాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
తుల..అప్పులు చేయాల్సివస్తుంది. దూరప్రయాణాలు. బాద్యతలు ఉక్కిరిబిక్కిరి చే స్తాయి. స్వల్ప రుగ్మతలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. అనుకోని ఖర్చులు.
వృశ్చికం...దూరపు బంధువుల నుంచి ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
ధనుస్సు....ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. కార్యక్రమాలలో స్వల్ప అవాంతరాలు. శారీరక రుగ్మతలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు. ఖర్చులు పెరుగుతాయి.
మకరం....కుటుంబంలో శుభకార్యాలు ప్రస్తావన. ఆస్తి వివాదాలు పరిష్కారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. వాహనసౌఖ్యం.
కుంభం....పరిస్థితులు అనుకూలిస్తాయి. అందరిలోనూ గౌరవం. కీలకమైన నిర్ణయాలు. కార్యజయం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మీనం....అనుకోని ప్రయాణాలు. ఇంటి బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. కృషి ఫలించదు. ఆస్తి వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.


