రైల్లో లోదుస్తులతో ఎమ్మెల్యే చక్కర్లు.. నెటిజన్ల ట్రోలింగ్‌

JDU MLA Trolled After He Was Spotted Roaming in Undergarments on Train - Sakshi

పాట్నా: బిహార్‌ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్‌ మండల్‌ సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌ ఎదుర్కొంటున్నారు. దీనికి ఆయన లోదుస్తులు ధరించి రైలులో తిరగమే కారణం. ఈ ఘటన గురువారం పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న తేజాస్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోటుచేసకుంది. అసలేం జరిగిందంటే.. జేడీయూ ఎమ్మెల్యే గోపాల్‌ మండల్‌ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఏసీ బోగిలో ప్రయాణించారు. అయితే ఈ రైలు ఉత్తర ప్రదేశ్‌లోని దిల్‌నగర్‌ స్టేషన్‌ దాటుతున్న సమయంలో ఎమ్మెల్యే తన దుస్తులు తీసేసి కేవలం లోదుస్తులు(బనియన్‌,అండర్‌వేర్‌)తో వాష్‌రూమ్‌కు వెళ్లారు.

అయితే అదే కంపార్ట్‌మెంట్‌లో బిహార్‌కు చెందిన ప్రహ్లద్‌ పాశ్వాన్‌ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్నారు. ఎమ్మెల్యే అవతారం చూసిన ఆ వ్యక్తి మండల్‌ వేషాధారణపై అ‍్యభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో మండల్‌ ఆ వ్యక్తితో వాదనకు దిగాడు. అక్కడితో ఆగకుండా ఇతర ప్రయాణికులను సైతం దూషించాడు. కాగా మండల్‌ ప్రయాణికులను కొట్టేందుకు ప్రయత్నించాడని, వారు ఎమ్మెల్యే ప్రవర్తనపై మండిపడటంతో కాల్చి వేస్తామని కూడా బెదిరించాడని పాశ్వాన్‌ ఆరోపించారు. అయితే అతను బిహార్‌ ఎమ్మెల్యే అని తనకు తెలీయదని పేర్కొన్నారు.
చదవండి: ఆస్తులు అమ్మితే ఆటకట్టిస్తాం: ఎంకే స్టాలిన్‌

ఇదంతా జరిగిన తర్వాత ప్రయాణికులు ఆర్‌పీఎఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు మండల్‌ను రైలులోని మరో కోచ్‌కు మార్చారు. అయితే చివరికి గోపాల్‌ మండల్‌ తన చర్యలను సమర్థించుకున్నారు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తన కడుపు నొప్పి ఉందని అందులే కేవలం లోదుస్తులు ధరించినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఎమ్మెల్యే లోదుస్తులు ధరించిన ఫోటోలు, వివరణ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వెంటనే అతన్ని నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తున్నారు. ‘అండర్ వేర్‌లో తిరుగుతుంటే కడుపు నొప్పి తగ్గుతుందని మాకు తెలియదే’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

గోపాల్ మండల్ స్నేహితుడు కునాల్ సింగ్  మాట్లాడుతూ.. మండల్ డయాబెటిస్ పేషెంట్ అని,  ఏదో "అత్యవసర పని మీదసం ఢిల్లీ వెళ్తున్నాడని పేర్కొన్నాడు. మండల్‌ అధిక బరువు కారణంగా బట్టలతో వాష్‌రూమ్‌కు వెళ్లలేకపోయాడని అందుకే లుంగీ మీద వాష్‌రూమ్‌ ఉపయోగించాలనుకున్నట్లు తెలిపాడు. ‘రైలు ఎక్కిన తర్వాత, గోపాల్ వాష్‌రూమ్‌కు వెళ్లాలనుకున్నాడు. తొందరపాటులో తన లోదుస్తుల్లో వెళ్లాడు. అప్పుడే ఓ ప్యాసింజర్ మండల్‌తో మాట్లాడాడు. దీనికి మండల్‌ బదులేమి ఇవ్వకుండా వాష్‌రూమ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్యాసింజర్‌తో మాట్లాడారు "అని కునాల్ సింగ్ చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top