ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Jarann Movie OTT Telugu Streaming Now | Sakshi
Sakshi News home page

Jarann OTT Telugu: చేతుబడుల సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో

Nov 7 2025 5:01 PM | Updated on Nov 7 2025 5:19 PM

Jarann Movie OTT Telugu Streaming Now

ఓటీటీలో థ్రిల్లర్ లేదంటే హారర్ సినిమాలని ఎక్కువగా చూస్తుంటారు. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు డిఫరెంట్ హారర్ మూవీస్ వస్తూనే ఉంటాయి. తెలుగులో మాత్రం వివిధ భాషల్లోనూ ఈ జానర్ మూవీస్ హిట్ ఫార్ములానే. అలా ఈ ఏడాది జూన్‌లో రిలీజైన ఓ మరాఠీ హారర్.. ఇ‍న్నాళ్లకు తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఏంటి మూవీ స్పెషాలిటీ? ఎందులో చూడొచ్చు.

(ఇదీ చదవండి: 'ఆర్యన్' రివ్యూ.. థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది?)

ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో రిలీజైన మరాఠీ సినిమా 'జారన్'. మరాఠీ భాషలో ఈ టైటిల్‍‌కి అర్థం చేతబడి. పేరుకి తగ్గట్లే మొత్తం బ్లాక్ మ్యాజిక్ తరహా సీన్స్ ఉంటాయి. ఇది ఆగస్టులోనే జీ5 ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే హిందీలో మాత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌ని కూడా తీసుకొచ్చేశారు. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సైకలాజికల్ హారర్ చిత్రాలంటే ఆసక్తి ఉంటే దీనిపై ఓ లుక్కేయండి.

'జారన్' విషయానికొస్తే.. రాధ(అమృత సుభాష్)కు భర్త, కుమార్తె ఉంటారు. బతకడం అయితే బతుకుతూ ఉంటుంది గానీ ఈమె ఇంట్లో ఏ మాత్రం ప్రశాంతత, సంతోషం అనేది ఉండదు. దానికి కారణం చేతబడి. రాధ కుటుంబాన్ని ఎవరో చేతబడి చేస్తారు. ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి రాధ.. ఈ సమస్యతో బాధపడుతూ ఉంటుంది. అసలు రాధకు ఎవరు ఇలా చేతబడి చేశారు? ఆమె కుటుంబంపై ఎవరికి పగ ఉంది? ఎందుకు ఉంది? చివరకు ఏమైందనేదే అసలు స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement