
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్.. తన సీనియర్ మేనేజ్‌మెంట్ బృందానికి కొత్త సేల్స్ ఫంక్షన్ హెడ్‌గా 'సునీల్ మూల్‌చందాని' (Sunil Moolchandani) ప్రకటించింది. ఈయన నియామకం ఈ రోజు (2025 అక్టోబర్ 23) నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది.
సునీల్ మూల్‌చందాని.. కొత్త బాధ్యతలు స్వీకరించిన తరువాత, హ్యుందాయ్ అమ్మకాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. అంతే కాకుండా ఇండియన్ ఆటోమోటివ్ మార్కెట్లో బ్రాండ్ స్థిరమైన వృద్ధి లక్ష్యానికి దోహదం చేస్తారు. కంపెనీ వృద్ధి ఈయన సారథ్యంలో మరింత పెరుగుతుందని తన విశ్వాసం వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 63వేల కార్లపై ఎఫెక్ట్!
సునీల్ మూల్‌చందాని.. పూణే యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. అంతే కాకుండా ఈయన పూణేలోని సింబయోసిస్ సెంటర్ ఫర్ మేనేజ్‌మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ (SCMHRD) నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కూడా పూర్తి చేశారు. ఈయన హ్యుందాయ్‌లో చేరడానికి ముందు అనేక ఆటోమోటివ్ మరియు మొబిలిటీ బ్రాండ్‌లలో సీనియర్ పాత్రలు పోషించారు. ఇలా అంచెలంచెలుగా ఎదిగి హ్యుందాయ్ సేల్స్ ఫంక్షన్ హెడ్‌గా పదోన్నతి పొందారు.