రికార్డు స్థాయిలో భారత్‌లో బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు! | India retail sector buzzing with Black Friday sales | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో భారత్‌లో బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు!

Nov 29 2025 9:43 AM | Updated on Nov 29 2025 10:29 AM

India retail sector buzzing with Black Friday sales

దీపావళి షాపింగ్ ఇటీవలే ముగిసినా భారతీయ కొనుగోలుదారులు మళ్లీ ఆఫర్ల కోసం వెతుకుతూ షాపింగ్‌ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. నవంబర్ 28న అమెరికన్ బ్లాక్ ఫ్రైడే భారతదేశంలో కూడా మహా సేల్ డేగా మారిపోయింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, నైకా, టాటా క్లిక్, క్రోమా, మింత్రా, రిలయన్స్ డిజిటల్, సామ్‌సంగ్ షాప్.. అన్నీ వారం నుంచే ‘ఎర్లీ బ్లాక్ ఫ్రైడే’ పేరుతో భారీ డిస్కౌంట్ల మోత మోగిస్తున్నాయి.

ఒక రోజే కాదు..

గతంలో బ్లాక్ ఫ్రైడే అంటే నవంబర్ చివరి శుక్రవారం ఒక్క రోజు మాత్రమే ఆఫర్లు ఉండేవి. ఈసారి చాలా ప్లాట్‌ఫామ్‌లు నవంబర్ 22–23 నుంచే సేల్స్ ప్రారంభించాయి. డిసెంబర్ 2–3 వరకు (సైబర్ మండే తర్వాత కూడా) ఇవి కొనసాగనున్నాయి. అంటే దాదాపు 10–12 రోజుల పాటు నాన్‌స్టాప్ షాపింగ్ కార్నివాల్‌గా దీన్ని పరిగణిస్తున్నాయి.

ప్రస్తుతం వివిధ రిటైలర్లు ఇస్తున్న ఆఫర్లు కింది విధంగా ఉన్నాయి.

  • ఎలక్ట్రానిక్స్ (60–70% వరకు ఆఫ్)

  • ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ (80% వరకు డిస్కౌంట్)

  • బ్యూటీ, పర్సనల్ కేర్ (బై-1 గెట్-3 ఆఫర్లు)

  • హోమ్ అప్లయెన్సెస్, ఫర్నిచర్ (నో-కాస్ట్ ఈఎంఐ + 25–40% ఆఫ్)

  • ప్రీమియం, లగ్జరీ బ్రాండ్స్‌పై 50–60% వరకు తగ్గింపు. (పైఆఫర్లలో షరతులు వర్తిస్తాయని గుర్తుంచు​కోవాలి)

‘దీపావళి తర్వాత కస్టమర్లు పెద్దగా ఖర్చు చేసేందుకు మొగ్గు చూపరేమోనని అనుకున్నాం. కానీ ఈసారి డిమాండ్ అంచనాలను మించిపోయింది. ముఖ్యంగా జెన్‌-జీ, మిలినియల్స్ బ్లాక్ ఫ్రైడే అనగానే భారీగా కొనుగోళ్లు చేస్తున్నారు’ అని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఒకరు చెప్పారు. పరిశ్రమ అంచనాల ప్రకారం 2025 బ్లాక్ ఫ్రైడే నుంచి సైబర్ మండే వరకు వీకెండ్ సేల్స్ గత ఏడాది కంటే 22–27% ఎక్కువగా నమోదు కానున్నాయి. దీంతో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న బ్లాక్ ఫ్రైడే మార్కెట్‌ల్లో ఒకటిగా అవతరించింది.

ఇదీ చదవండి: వెండికి హాల్‌మార్కింగ్‌.. వజ్రాభరణాలపై ఫ్రేమ్‌వర్క్‌

Advertisement
 
Advertisement
Advertisement