
పీడబ్ల్యూసీ ఇండియా ప్రణాళికలు
కన్సల్టెన్సీ దిగ్గజం పీడబ్ల్యూసీ ఇండియా వచ్చే ఐదేళ్ల వ్యవధిలో కొత్తగా 20,000 ఉద్యోగాలు కల్పించనుంది. దీనితో సంస్థలో మొత్తం సిబ్బంది సంఖ్య 50,000కు చేరనుంది. విజన్ 2030ని ప్రకటించిన సందర్భంగా పీడబ్ల్యూసీ ఇండియా చైర్‌పర్సన్ సంజీవ్ కృషన్ ఈ విషయం తెలిపారు. వచ్చే ఐదేళ్లలో వార్షికాదాయాల్లో 5% టెక్నాలజీ, ఇన్నోవేషన్ తదితర అంశాలపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు.
దాంతోపాటు డిజిటల్ పరివర్తన, క్లౌడ్, సైబర్‌సెక్యూరిటీలాంటి వ్యాపార విభాగాల పై దృష్టి పెట్టనున్నట్లు సంజీవ్ చెప్పారు. సిబ్బంది, భాగస్వాములకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు ఆదాయాల్లో 1 శాతం భాగాన్ని వెచ్చిస్తున్నట్లు వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోకి కూడా కార్యకలాపాలు విస్తరిస్తూ, హైరింగ్ చేపడుతున్నామని సంజీవ్ చెప్పారు. ప్రధానంగా ఆర్థిక సేవలు, హెల్త్‌కేర్, ఆటో, టెక్నాలజీ, మీడియా వంటి ఆరు విభాగాలపై ఫోకస్ పెడుతున్నట్లు వివరించారు.