
ఈ వారం బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ఆగస్టు 25 నుంచి 31వ తేదీ వరకూ ఏయే రోజుల్లో బ్యాంకు సెలవులు ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ఆర్బీఐ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద పండుగలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ఈ వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు.
బ్యాంకింగ్ లావాదేవీలు లేదా ఇతర సేవలకు సంబంధించి నేరుగా బ్యాంకు శాఖల్లో ముఖ్యమైన కార్యకలాపాలను ప్లాన్ చేసేవారి కోసం ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం. ఈ వారం ఏయే రోజుల్లో ఎక్కడెక్కడ బ్యాంకులకు సెలవులు ఉంటాయో ఆ ఆజాబితాను తెలియజేస్తున్నాం. తదనుగుణంగా ప్లాన్ చేసుకుని చివరి నిమిషంలో అసౌకర్యాన్ని నివారించవచ్చు.
ఇదిగో సెలవుల జాబితా..
ఆగస్టు 25 (సోమవారం) - శ్రీమంత శంకరదేవుని తిరుభవ్ తిథి కారణంగా గౌహతి (అస్సాం) లో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 27 (బుధవారం) - వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో సెలవు.
ఆగస్టు 28 (గురువారం) - గణేష్ చతుర్థి (రెండవ రోజు) / నువాఖై కారణంగా భువనేశ్వర్, పనాజీలో బ్యాంకుల మూసివేత
ఆగస్టు 31 (ఆదివారం) - వారాంతపు సెలవు దినం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని చోట్ల బ్యాంకుల మూసివేత
ప్రాంతీయ, స్థానిక ఆచార సంప్రదాయాల కారణంగా దేశంలో సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు.
చెక్కులు, ప్రామిసరీ నోట్ల జారీకి సంబంధించిన నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం బ్యాంక్ వార్షిక హాలిడే క్యాలెండర్‌ను ఆర్బీఐ ప్రకటిస్తుంది. అందువల్ల ఈ లిస్టెడ్ సెలవు దినాల్లో ఈ సాధనాలకు సంబంధించిన లావాదేవీలు అందుబాటులో ఉండవు.
బ్యాంకు సెలవులు శాఖ కార్యకలాపాలను తాత్కాలికంగా ప్రభావితం చేసినప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ మీ లావాదేవీలు సజావుగా కొనసాగేలా చేస్తుంది.
నగదు అత్యవసరాల కోసం ఏటీఎంలు యథావిధిగా విత్ డ్రా చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్ చెల్లింపుల కోసం సంబంధిత బ్యాంక్ యాప్, పయూపీఐని కూడా ఉపయోగించవచ్చు.
ఇదీ చదవండి: బంగారం ధరలకు బ్రేక్.. తులానికి ఎంతంటే..