
స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా తాజాగా కే13 టర్బో సిరీస్ ప్రో 5జీ, టర్బో 5జీ ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో అంతర్గతంగా కూలింగ్ ఫ్యాన్ ఉంటుందని, దేశీయంగా స్మార్ట్‌ఫోన్లలో ఈ ఫీచరును అందించడం ఇదే ప్రథమం అని సంస్థ తెలిపింది. భారీగా మల్టీ టాస్కింగ్, గేమింగ్‌కి అనువుగా ఇవి ఉంటాయని వివరించింది.
7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 1.5 అమోలెడ్ డిస్‌ప్లే తదితర ఫీచర్లు వీటిలో ఉన్నాయి. దీని ధర రూ. 27,999 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఆఫర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే రూ. 24,999 నుంచి లభిస్తుందని సంస్థ తెలిపింది. టర్బో ప్రో 5జీ ఫోన్ల సేల్ ఆగస్టు 15 నుంచి, టర్బో 5జీ ఫోన్ల అమ్మకాలు 18 నుంచి ప్రారంభమవుతాయి.
ముఖ్యమైన ఫీచర్లు
ఇండియాలో మొట్టమొదటి సారిగా అంతర్గత కూలింగ్ ఫ్యాన్ ఉన్న స్మార్ట్‌ఫోన్
గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందింది.
ట్రిపుల్-లెవల్ కూలింగ్ సిస్టమ్: కూలింగ్ ఫ్యాన్, ఎయిర్ డక్ట్స్, 5000mm² వేపర్ చాంబర్.
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ఎస్‌ఓసీ
ర్యామ్ & స్టోరేజ్: 8జీబీ/12జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్‌ఎస్ 4.0 స్టోరేజ్.
డిస్‌ప్లే: 6.8 అంగుళాల ఎల్‌టీపీఎస్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10+, 1500 నిట్స్ బ్రైట్‌నెస్.
బ్యాటరీ: 7000mAh, 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ (15 నిమిషాల్లో 50%).
కెమెరా: 50MP + 2MP రియర్, 16MP ఫ్రంట్, 4K 60fps వీడియో సపోర్ట్.
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్‌ఓఎస్ 15, 2 ఓఎస్ అప్‌డేట్లు, 3 ఏళ్లు సెక్యూరిటీ ప్యాచ్‌లు

ధర & లభ్యత
కే13 టర్బో ప్రో 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ.37,999 కాగా డిస్కౌంట్‌లో రూ. 34,999 లకు లభిస్తుంది. అలాగే కే13 టర్బో 5జీ ఫోన్ ధర రూ. 27,999 కాగా తగ్గింపులు పోగా రూ. 24,999 లకు లభిస్తుంది. ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఈ-స్టోర్లు, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా అందుబాటులో ఉంటాయి.