ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో అసంఘటిత రంగ సంస్థల్లో (యూఎస్‌ఈ) ఉద్యోగాలు స్వల్పంగా పెరిగాయి. క్రితం క్వార్టర్‌లో 12,85,72,500గా ఉండగా సెప్టెంబర్ త్రైమాసికంలో 12,85,95,600కి చేరాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన సర్వే డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
తయారీ, వాణిజ్యం, ఇతర సర్వీసులు అనే మూడు వ్యవసాయేతర రంగాల గణాంకాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారం, ప్రత్యేకంగా చట్టబద్ధమైన సంస్థలుగా నమోదు చేసుకోని ఈ తరహా సంస్థల్లో ఉద్యోగాలు జనవరి–మార్చి క్వార్టర్‌లో నమోదైన 13,13,38,000తో పోలిస్తే రెండో ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో తగ్గాయి.
ఈ రంగంలో ఇంటర్నెట్ వినియోగం జూన్ క్వార్టర్‌లో నమోదైన 36 శాతంతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో 39 శాతానికి పెరిగింది. సెపె్టంబర్ త్రైమాసికంలో తయారీలో ఉపాధి పెరిగింది.


