
ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ మళ్లీ టెక్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన స్థాపించిన కొత్త ఏఐ స్టార్టప్ ‘ప్యారలల్ వెబ్ సిస్టమ్స్’ ఇటీవలే 30 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.250 కోట్లు) పెట్టుబడులను సమీకరించింది. ఖోస్లా వెంచర్స్, ఇండెక్స్ వెంచర్స్, ఫస్ట్ రౌండ్ క్యాపిటల్ వంటి ప్రముఖ వెంచర్ క్యాపిటల్స్ ఈ సంస్థలో పెట్టుబడి పెట్టాయి.
ఏఐకి బ్రౌజర్ ఇచ్చినట్లే!
ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ ఒక క్లౌడ్-బేస్డ్ ఏఐ రీసెర్చ్ ప్లాట్‌ఫారమ్. ఇది ఏఐ మోడల్స్‌కు రియల్ టైమ్ వెబ్ డేటాను యాక్సెస్ చేయగలిగే సామర్థ్యాన్ని కల్పిస్తుంది. సాధారణంగా AIలు ట్రైనింగ్ డేటాపై ఆధారపడతాయి. కానీ లైవ్ వెబ్ సమాచారం చదవడం, నిజమైన సమాచారం గుర్తించడం, సమాధానాలపై విశ్వాస స్థాయిని అంచనా వేయడం వంటివి ప్యారలల్ ప్రత్యేకతలు.
మానవుల కంటే మెరుగైన అన్వేషణ
ఈ స్టార్టప్ అభివృద్ధి చేసిన అల్ట్రా8ఎక్స్ (Ultra8x) అనే రీసెర్చ్ ఇంజిన్ 30 నిమిషాల పాటు లోతైన వెబ్ అన్వేషణ చేయగలదు. ఇది ఓపెన్‌ఏఐ జీపీటీ-5 (OpenAI GPT-5)తో సహా మానవ రీసెర్చర్ల కంటే 10 శాతం మెరుగైన పనితీరును చూపిందని సంస్థ పేర్కొంది.
ట్విట్టర్ నుంచి టెక్ రీ-ఎంట్రీ
2022లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, సీఈవో పదవిలో ఉన్న పరాగ్ అగర్వాల్‌ను ఎలాన్ మస్క్ తొలగించారు. ఆ తర్వాత పరాగ్ పాలో ఆల్టోలోని కాఫీ షాపుల్లో రీసెర్చ్ పేపర్లు చదువుతూ, కోడ్ రాస్తూ గడిపారు. హెల్త్‌కేర్ ఏఐ స్టార్టప్ ఆలోచించినా, చివరికి ఏఐకి రియల్ టైమ్ వెబ్ డేటాను విశ్వసనీయంగా అందించాలన్న లక్ష్యంపై దృష్టి పెట్టారు.
మస్క్‌తో రూ.420 కోట్ల సెవరెన్స్ వివాదం
పరాగ్ అగర్వాల్ ఇంకా 50 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.420 కోట్లు) సెవరెన్స్ పేమెంట్ కోసం మస్క్‌తో కోర్టులో పోరాటం చేస్తున్నారు. మస్క్ “ఫర్ కాస్” అనే కారణంతో చెల్లింపును నిలిపివేశాడు.