
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ(ఎన్‌ఎస్‌డీఎల్)లో వాటా విక్రయం ద్వారా వచి్చన లాభంతో కలుపుకొని, ఐడీబీఐ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ త్రైమాసికంలో రూ.3,627 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. ఎన్‌ఎస్‌డీఎల్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 2.22 కోట్ల ఈక్విటీలు(11.11% వాటాకు సమానం) జారీ చేసి రూ.1,698.96 కోట్లు ఆర్జించినట్లు బ్యాంకు ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది.
గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో ఆర్జించిన రూ.1,836 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది రెట్టింపు. ఇదే క్యూ2లో నిర్వహణ లాభం 17% వృద్ధి చెంది రూ.3,006 కోట్ల నుంచి రూ.3,523 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.3,875 కోట్ల నుంచి రూ.3,285 కోట్లకు దిగివచ్చింది. స్థూల ఎన్‌పీఏ రేషియో 3.68% నుంచి 2.65 శాతానికి మెరుగుపడింది.
నికర ఎన్‌పీఏ స్వల్పంగా 0.20% నుంచి 0.21 శాతానికి పెరిగింది. మొత్తం వ్యాపార వార్షిక వృద్ధి 12% పెరిగి రూ.5,33,730 కోట్లకు చేరింది. సెపె్టంబర్ 30 నాటికి బ్యాంకు మొత్తం డిపాజిట్ల విలువ రూ.3 లక్షల కోట్లకు చేరుకుంది. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్స్ రూ.1,39,036 కోట్లుగా, కాసా రేషియో 45.81% నమోదైందని పేర్కొంది.