
ప్రముఖ ఓటీటీ జియో హాట్స్టార్ను ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా వీక్షించే అవకాశం.. అది కూడా జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్.. ఇలా ఏ యూజర్ అయినా పర్వాలేదు. అయితే ఈ ఆఫర్ కేవలం ఒక్క రోజు మాత్రమే.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న తమ ఓటీటీ యాప్లోని కంటెంట్ మొత్తం ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది జియో హాట్స్టార్. జియో హాట్ స్టార్‌కు చెందిన అన్ని షోలు, సినిమాలు, వెబ్సిరీస్లు రోజంతా ఉచితంగా వీక్షించవచ్చు.
ఈ బిగ్ అనౌన్స్మెంట్కు సంబంధించిన బ్యానర్ జియో హాట్‌స్టార్ యాప్లో కనిపిస్తోంది. ఈ బ్యానర్లలో "ప్రౌడ్ ఇండియన్ ప్రౌడ్లీ ఫ్రీ" అనే ట్యాగ్ లైన్ తో "ఫ్రీ" అని రాసి ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ జియో హాట్స్టార్ కంటెంట్ను వీక్షించవచ్చు. ఇందుకోసం మొబైల్ లేదా టీవీ యాప్ లోకి లాగిన్ అవ్వాలి. ఆగస్టు 15న జియో హాట్స్టార్లో సలాకార్ అనే కొత్త సిరీస్ రాబోతోంది. ఇది ఒక డిటెక్టివ్ కథ. ఆగస్టు 15న ఉచితం కావడంతో ఈ సిరీస్ను ఉచితంగా ఆస్వాదించవచ్చు.
ఈ ఆఫర్ అందరికీ..
ఈ ఆఫర్ ప్రత్యేకత ఏమిటంటే జియో హాట్స్టార్ను చూడటానికి జియో యూజరే అయి ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే జియో హాట్స్టార్ బండిల్ ఆఫర్ ఎయిర్టెల్, వీఐ ప్లాన్లలో కూడా అందుబాటులో ఉంది. మామూలుగా ఎంపిక చేసిన కొంత కంటెంట్ జియో హాట్స్టార్లో ఎప్పుడైనా ఉచితంగా చూడవచ్చు. కానీ ఆగస్టు 15న మాత్రం 24 గంటల పాటు మొత్తం కంటెంట్ను ఉచితంగా అందించనున్నారు.