
భారత ఆటోమొబైల్ పరిశ్రమను వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలో నంబర్ 1గా మారుస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈఐసీఐ, కేపీఎంజీ నివేదికను ఆవిష్కరించిన సందర్భంగా గడ్కరీ మాట్లాడారు. భారత ఆటో పరిశ్రమ విలువ ప్రస్తుతం రూ.22 లక్షల కోట్లుగా ఉందన్నారు.
2014లో తాను రవాణా శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి పరిశ్రమ పరిమాణం రూ.7.5 లక్షల కోట్లుగానే ఉన్నట్టు గుర్తు చేశారు. అమెరికా ఆటో రంగం విలువ రూ.78 లక్షల కోట్లుగా ఉంటే, చైనా ఆటోరంగం విలువ రూ.47 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మార్చాలన్నది ప్రధాని మోదీ లక్ష్యమన్నారు.
ఈ లక్ష్య సాధనాల్లో లాజిస్టిక్స్ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జీడీపీలో లాజిస్టిక్స్ వ్యయాలు 16 శాతంగా ఉంటే 10 శాతానికి తగ్గించగలిగినట్టు చెప్పారు. త్వరలో సింగిల్ డిజిట్‌కు తీసుకొస్తామని ప్రకటించారు.