
జీవిత బీమా సంస్థ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్.. ప్రత్యేకంగా మహిళల కోసం శుభ్ శక్తి పేరిట టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రెగ్నెన్సీ సమయంలో ప్రీమియం హాలిడే, పురుషుల పాలసీలతో పోలిస్తే ప్లాన్ వ్యవధి ఆసాంతం ప్రీమియంపై 15% సుమారు డిస్కౌంటు, సింగిల్ మదర్స్‌కి దీనికి అదనంగా 1% మేర జీవితకాల డిస్కౌంటులాంటి ఫీచర్లు ఈ పాలసీలో ఉంటాయి.
అలాగే సర్వికల్ క్యాన్సర్, హెచ్‌పీవీ మొదలైన వాటికి టీకాలపరమైన మద్దతు, ఐవీఎఫ్ కౌన్సెలింగ్, స్పెషలిస్ట్ కన్సల్టేషన్లు, వార్షిక హెల్త్ చెకప్‌ల వంటి ప్రయోజనాలు ఉంటాయని సంస్థ చీఫ్ కాంప్లయెన్స్ ఆఫీసర్ గాయత్రి నాథన్ తెలిపారు.
పాలసీ ముఖ్య లక్షణాలు
ప్రీమియం హాలిడే: బిడ్డ పుట్టిన తర్వాత 12 నెలల పాటు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పాలసీ వ్యవధిలో రెండుసార్లు వర్తిస్తుంది.తక్కువ ప్రీమియం: పురుషుల పాలసీలతో పోలిస్తే మహిళలకు 15% తక్కువ ప్రీమియం ఉంటుంది. ఇది పాలసీ కాలం మొత్తం వర్తిస్తుంది.
ఒంటరి తల్లులకు ప్రత్యేక రాయితీ: జీవితకాల ప్రీమియంపై అదనంగా 1% తగ్గింపు.
ఆరోగ్య ప్రయోజనాలు: సర్వికల్ క్యాన్సర్, హెచ్‌పీవీ వంటి వ్యాధులకు టీకాల మద్దతు
ఐవీఎఫ్ కౌన్సెలింగ్, స్పెషలిస్ట్ కన్సల్టేషన్లు, వార్షిక హెల్త్ చెకప్‌లు
ప్రీమియం వెయివర్: జీవిత భాగస్వామి ప్రమాదవశాత్తూ మరణిస్తే, తదుపరి ప్రీమియాలు చెల్లించాల్సిన అవసరం లేదు.
అదనపు ప్రయోజనం: అదనపు ప్రీమియంతో పిల్లల విద్య కోసం నెలవారీ ఆదాయం పొందే అవకాశం (21 లేదా 25 ఏళ్ల వరకు)