
జియో బ్లార్‌రాక్ అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కొత్తగా ఐదు మ్యూచువల్ ఫండ్స్ పథకాల ఎన్‌ఎఫ్‌వోలను చేపట్టేందుకు సెబీ అనుమతి మంజూరు చేసింది. జియో బ్లాక్‌రాక్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, జియో బ్లాక్‌రాక్ నిఫ్టీ 8–13 జీ–సెక్ ఇండెక్స్ ఫండ్, జియో బ్లాక్‌రాక్ నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్, జియో బ్లాక్‌రాక్ నిఫ్టీనెక్ట్స్ 50 ఇండెక్స్ ఫండ్, జియో బ్లాక్‌రాక్ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్‌కు అనుమతి లభించింది.
ఇదీ చదవండి: ఐపీవోకు ఐవీఎఫ్ హాస్పటల్
వీటిల్లో నాలుగు ఈక్విటీ ఆధారిత ఇండెక్స్ పథకాలు కాగా, ఒక్కటి డెట్ ఆధారిత ఇండెక్స్ ఫండ్. జియో బ్లాక్‌రాక్ అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మొదటిసారి 3 డెట్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోల (లిక్విడ్ ఫండ్, ఓవర్‌నైట్ ఫండ్, మనీ మార్కెట్ ఫండ్) రూపంలో రూ.17,800 కోట్లను సమీకరించినట్టు ఈ నెల 7న ప్రకటించడం తెలిసిందే.