
సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు
ఫెర్టిలిటీ సర్వీసుల దిగ్గజం ఐవీఎఫ్ హాస్పిటల్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా మార్గంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇటీవల కొంతకాలంగా అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ(ఏఆర్‌టీ) రంగంపట్ల దేశీయంగా ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఇందిరా ఐవీఎఫ్ ప్రాస్పెక్టస్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ రంగంలో సుప్రసిద్ధమైన మరో సంస్థ గౌడియం ఐవీఎఫ్ అండ్ ఉమన్ హెల్త్ సైతం లిస్టింగ్ యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ఇందిరా ఐవీఎఫ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఐపీవోకు ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. అయితే మార్చిలో డాక్యుమెంట్స్‌ను వెనక్కి తీసుకుంది. కంపెనీ వ్యవస్థాపకుడు అజయ్ ముర్డియాపై బాలీవుడ్ బయోపిక్ రిలీజ్ నేపథ్యంలో వెనకడుగు వేసింది. తద్వారా పరోక్షంగా కంపెనీ సొంత ప్రమోషన్‌కు అవకాశమున్నట్లు సెబీ అభిప్రాయపడటంతో ఇందిరా ఐవీఎఫ్ ఐపీవోను విరమించుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: మారుతీ ఎర్టిగా, బాలెనో ధరలు పెరిగాయ్..
అయితే కంపెనీ ప్రతినిధి ఒకరు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రాస్పెక్టస్‌ను ఉపసంహరించినట్లు తెలియజేశారు. సెబీ ఆదేశాలతో అన్నది సరికాదని స్పష్టం చేశారు. ఇటీవల ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం టాటా క్యాపిటల్‌సహా.. ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్ కంపెనీ షాడోఫాక్స్ టెక్నాలజీస్, గాజా ఆల్టర్నేటివ్ ఏఎంసీ, షిప్‌రాకెట్, ఫిజిక్స్‌వాలా, బోట్ బ్రాండ్ మాతృ సంస్థ ఇమేజిన్ మార్కెటింగ్ సైతం గోప్యతా విధానంలోనే సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేయడం గమనార్హం!