మారుతీ ఎర్టిగా, బాలెనో ధరలు పెరిగాయ్‌.. | ex showroom price updates for the Maruti Baleno and Ertiga | Sakshi
Sakshi News home page

మారుతీ ఎర్టిగా, బాలెనో ధరలు పెరిగాయ్‌..

Jul 17 2025 8:46 AM | Updated on Jul 17 2025 8:53 AM

ex showroom price updates for the Maruti Baleno and Ertiga

మారుతీ సుజుకీ ఎర్టిగా, బాలెనో కార్ల ధరలు పెంచింది. ఈ మోడళ్లలో స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌ బ్యాగులు అందిస్తున్న కారణంగా వీటి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎర్టిగా ఎక్స్‌షోరూమ్‌ ధర 1.4% మేర పెరగ్గా.. బాలెనో ధర 0.5% పెరిగిందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. జులై 16 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ బాలెనో ధర రూ.6.7 లక్షలు – రూ.9.92 లక్షలుగా ఉంది. ఎర్టిగా ధర రూ.8.97 లక్షల నుంచి ప్రారంభమై రూ.13.25 లక్షల వరకు ఉంది.

ఇదీ చదవండి: ఉపాధి కల్పించేలా రూ.200 కోట్లు పెట్టుబడి

ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణాలు

  • ఉక్కు, అల్యూమినియం, రబ్బరు వంటి ముడి పదార్థాలు సంవత్సర ప్రాతిపదికన గణనీయమైన పెరుగుదలను చూశాయి. అల్యూమినియం 10.6%, రబ్బరు దాదాపు 27% పెరిగింది. ఇవి నేరుగా తయారీ వ్యయాలను పెంచుతాయి.

  • యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడింది. దిగుమతి చేసుకునే విడిభాగాలు మరింత ఖరీదైనవిగా మారాయి.

  • భారత్ స్టేజ్ 7 ప్రమాణాలను అమలు చేయడం కోసం వాహన తయారీదారులు శుభ్రమైన సాంకేతికతల్లో పెట్టుబడి పెట్టాలి.

  • ఆపరేషనల్ & లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగాయి. ఇంధనం, రవాణా, గిడ్డంగుల ఛార్జీలు పెరిగాయి.

  • స్థానిక తయారీని ప్రోత్సహించడానికి, దిగుమతి చేసుకునే విడిభాగాలపై సుంకాలు పెరిగాయి. ఇది మార్జిన్లపై ప్రభావం చూపింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement