
ప్రపంచం కుబేరుడు 'ఎలాన్ మస్క్' యాజమాన్యంలోని ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం 'టెస్లా'.. ముంబైలో తన మొదటి షోరూమ్ ప్రారంభించింది. ఇప్పుడు తన రెండో షోరూంను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.
తన రెండో షోరూమ్ కోసం టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీలోని ఏరోసిటీలో 8,200 చదరపు అడుగుల స్థలాన్ని తొమ్మిది సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. దీని నెలవారీ అద్దె రూ. 17.22 లక్షలు. ఈ విషయాన్ని డాక్యుమెంట్స్‌ను అసెస్ చేసిన 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' వెల్లడించింది.
టెస్లా ఈ స్థలాన్ని ఓక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చదరపు అడుగుకు రూ. 210 చొప్పున.. రూ.1.03 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌తో లీజుకు తీసుకుంది. అంతే కాకుండా టెస్లా నెలకు రూ. 6,000 చొప్పున 10 పార్కింగ్ స్లాట్‌లను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ప్రపంచాన్ని వణికించిన '1929 మహా మాంద్యం': ప్రధాన కారణాలు ఇవే..
జూలై 15, 2025న ప్రారంభమయ్యే లీజు మొదటి సంవత్సరానికి రూ. 40.17 లక్షలు, రెండవ సంవత్సరంలో రూ. 42.07 లక్షలు, మూడవ సంవత్సరంలో రూ. 44.07 లక్షలు, నాల్గవ సంవత్సరంలో రూ. 46.17 లక్షలు, ఐదవ సంవత్సరంలో రూ. 48.36 లక్షలు, ఆరవ సంవత్సరంలో రూ. 50.66 లక్షలు, ఏడవ సంవత్సరంలో రూ. 53.06 లక్షలు, ఎనిమిదవ సంవత్సరంలో రూ. 55.58 లక్షలు, తొమ్మిదవ సంవత్సరంలో రూ. 58.22 లక్షలకు చేరుకుంటుంది.