
కొత్తగా కారు కొన్నాక కొందరు పూజలు చేయించి నిమ్మకాయలు తొక్కించి బండిని ముందుకు తీసుకెళ్లడం చూస్తుంటాం. అయితే అలాంటి ప్రయత్నాన్ని షోరూమ్‌లోనే చేయబోయింది ఓ మహిళ. పొరపాటు జరగడంతో 27 లక్షల విలువ చేసే కొత్తకారు యాక్షన్ సినిమాలో మాదిరి అద్దాలు బద్దలు కొట్టుకుని ఫస్ట్ ఫ్లోర్ నుంచి భూమ్మీద బొక్కబొర్లాపడిపోయింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్ అనే మహిళ తన భర్త ప్రదీప్‌తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్ విహార్‌కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి బయటకు తేవాలనుకుంది. ఈలోపు..
పొరపాటును ఎక్సలేటర్‌ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్‌ఫ్లోర్ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్ సీన్ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆ కారు ధర రూ. 27 లక్షలుగా తెలుస్తోంది.
दिल्ली के निर्माण विहार में स्थित महिंद्र शोरूम से महिला ने 27 लाख की थार खरीदी और शोरूम में ही पूजापाठ की, महिला को कार का पहिया नींबू पर चढ़ाना था लेकिन महिला ने ज्यादा एक्सीलेटर दिया और कार बिल्डिंग को तोड़ते हुए 15 फीट नीचे गिर गई#delhi #thar #viralvideo #laxminagar pic.twitter.com/oGgAvDkeZg
— Live Viral Breaking News (@LVBNewsOfficial) September 9, 2025
అయితే మరికొన్ని మీడియా చానెల్స్ మాత్రం మరోలా కథనాలు ఇస్తున్నాయి. షోరూం సిబ్బంది ఆ భార్యభర్తలకు డెమో ఇచ్చే టైంలో ప్రమాదం జరిగిందనిప్రసారం చేస్తున్నాయి. డెమో ఇచ్చే టైంలో ఆ సిబ్బంది కారు ఇంజిన్ ఆన్ చేశాడని, హఠాత్తుగా ఆ మహిళ ఎక్సలేటర్ తొక్కడంతో కారు బయటకు దూసుకొచ్చిందన్నది ఆ కథనం సారాంశం. ఏదిఏమైనా.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు వ్యంగ్యంగా స్పందిస్తుననారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించాలంటూ పలువురు నెటిజన్లు కోరుతుండడం గమనార్హం.