
సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ దేశీయంగా యువతకు చేయూతనివ్వనుంది. ఇందుకు సీఎస్‌ఆర్ విభాగం ఇన్ఫోసిస్ ఫౌండేషన్.. తాజాగా ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్ లైవ్‌లీహుడ్ ప్రోగ్రామ్‌కు తెరతీసింది. తద్వారా 2030కల్లా 5 లక్షల మంది ఉద్యోగార్ధులకు అర్థవంతమైన ఉపాధిని కల్పించేందుకు దారి చూపనుంది.
ఇదీ చదవండి: డాలీ చాయ్‌వాలా ఫ్రాంచైజీలకు 1600 దరఖాస్తులు
ఇందుకు తొలి దశలో రూ.200 కోట్లు వెచ్చించనుంది. గ్రాడ్యుయేట్లు, అండర్‌గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పించడంపై దృష్టి సారించనుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్(స్టెమ్), నాన్‌స్టెమ్ రంగాలలో యువతకు మద్దతివ్వనుంది. నైపుణ్య పెంపు కార్యక్రమాలపై దృష్టి పెట్టడం దేశీయంగా అతిపెద్ద అవకాశమని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుమిత్ విర్మాణీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.