
పేటీఎం మనీ తన ప్లాట్‌ఫామ్‌పై సిస్టమ్యాటిక్ యాక్టివ్ ఈక్విటీ (ఎస్‌ఏఈ) ఫండ్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇది దేశంలోనే మొదటిగా పేర్కొంది. జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్‌తో కలసి జియో బ్లాక్‌రాక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌లో పెట్టుబడులకు వీలు కల్పిస్తున్నట్టు తెలిపింది.
జియో బ్లాక్‌రాక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ బ్లాక్‌రాక్ ఎస్‌ఏఈ విధానం ఆధారంగా పెట్టుబడులు పెడుతుంది. ఈ కొత్త ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో) ఈ నెల 23న ప్రారంభం కాగా, అక్టోబర్ 7న ముగుస్తుంది. పేటీఎం మనీ యాప్‌పై ఎక్స్‌క్లూజివ్‌గా ఇది అందుబాటులో ఉంటుందని.. ఇన్వెస్టర్లు కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.
ఎలాంటి కమీషన్ తీసుకోవడం లేదని తెలిపింది. జియో బ్లాక్‌రాక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ విభాగంలో 1,000 కంపెనీలను.. డేటా విశ్లేషణ ఆధారంగా ఎంపిక చేసి పెట్టుబడులు పెడుతుంది. పరిశ్రమలోనే అతి తక్కువగా 0.50 శాతం ఎక్స్‌పెన్స్ రేషియోని ఈ ఫండ్‌లో వసూలు చేస్తుండడం గమనార్హం.