బాగాచదివి, మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని గొప్పగా చూసుకోవాలని ప్రతీ అమ్మాయి, లేదా అబ్బాయి కలగంటారు. ఎంతో పట్టుదలగా తమ కలను సాకారం చేసుకుంటారు. కానీ ఒక టీనేజ్ అబ్బాయి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. చదువులో రాణించలేకపోతున్నా మీ డబ్బులు దండుగ అంటూ ఏ తల్లిదండ్రీ భరించలేని పనిచేశాడు.
గ్రేటర్ నోయిడాలోని హాస్టల్‌లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు భిహార్‌కు చెందిన ఆకాష్ దీప్. ఢిల్లీ టెక్నికల్ క్యాంపస్ (DTC)లో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) మొదటి సంవత్సరం చదువుతున్న అతను మంగళవారం సాయంత్రం ఆకాష్ దీప్ తన గదిలో ఉరి వేసుకుని చనిపోయాడు. తన చదువు కోసం తల్లిదండ్రులు ఇకపై డబ్బు వృధా చేయకూడదనే కారణంతోనే ఈ పని చేసినట్లు ఒక సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. బయటకు వెళ్లి, తిరిగి వచ్చిన రూమ్‌మేట్ ఆకాష్ దీప్ ఉరి వేసుకోవడాన్ని గమనించి వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించాడు. కానీ అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు ఆకాష్ దీప్ ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సూసైడ్ నోట్‌లో ఏం ఉంది?
క్షమించండి, అమ్మా నాన్న, మీ కొడుకు బలహీనుడు. నా మరణానికి నేనే బాధ్యుడిని. దయచేసి నా మరణం గురించి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు. అమ్మా, ఇంటర్‌లో ఒక ఏడాది వృధా చేశా..రినాలుగేళ్లు బీటెక్ చదివి, డబ్బు వృధా చేయాలనుకోవడం లేదు. తప్పుడు ఆశలు కలిగించడం ఇష్టంలేదు. అందుకే ఇక్కడితో ముగించేస్తున్నా..క్షమించండి." అని రాసుకొచ్చాడు. చదువుల ఒత్తిడి కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి అరవింద్ కుమార్ చహల్ తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు.
మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్


