శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 573.41 పాయింట్లు లేదా 0.67 శాతం లాభంతో 85,762.01 వద్ద, నిఫ్టీ 182.00 పాయింట్లు లేదా 0.70 శాతం లాభంతో 26,328.55 వద్ద నిలిచాయి.
రోబస్ట్ హోటల్స్ లిమిటెడ్, షాలిమార్ పెయింట్స్, బీపీఎల్, సిల్వర్ టచ్ టెక్నాలజీస్, కృతి న్యూట్రియంట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టూరిజం ఫైనాన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా, క్యుపిడ్, వివిమెడ్ ల్యాబ్స్, కిరి ఇండస్ట్రీస్, ఎల్డెకో హౌసింగ్ అండ్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


