
జాయింట్ వెంచర్‌కు సెబీ ఓకే
న్యూఢిల్లీ: జియో బ్లాక్‌రాక్ అస్సెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేటు లిమిటెడ్ మ్యూచువల్ ఫండ్స్ సేవలు ప్రారంభించేందుకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, యూఎస్‌కు చెందిన బ్లాక్‌రాక్‌కు చెరో 50 శాతం వాటా కలిగిన జాయింట్ వెంచర్ (జేవీ) కంపెనీ ఇది.
‘జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్’కు సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తోపాటు.. జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్‌కు అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీగా వ్యవహరించేందుకు జియో బ్లాక్ రాక్ అస్సెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేటు లిమిటెడ్‌కు సెబీ ఈ నెల 26న అనుమతి మంజూరు చేసినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు జియో ఫైనాన్షియల్ సర్విసెస్ వెల్లడించింది. మరోవైపు జియోబ్లాక్‌రాక్ అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ సిద్ స్వామినాథన్‌ను ఎండీ, సీఈవోగా నియమించుకున్నట్టు ప్రకటించింది. ఈ వార్తలతో జియో ఫైనాన్షియల్ షేరు 3.50% పెరిగి రూ.292 వద్ద స్థిరపడింది. ఒకదశలో 4% లాభపడింది.