గురువారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 905.01 పాయింట్లు లేదా 1.24 శాతం లాభంతో 74,151.04 వద్ద, నిఫ్టీ 237.90 పాయింట్లు లేదా 1.05 శాతం లాభంతో 22,936.75 వద్ద నిలిచాయి.
బిర్లాసాఫ్ట్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్, పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో ఉండగా.. eClerx సర్వీసెస్ లిమిటెడ్, టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) లిమిటెడ్, హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


