దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:44 సమయానికి నిఫ్టీ(Nifty) 142 పాయింట్లు తగ్గి 22,607 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 575 పాయింట్లు దిగజారి 73,023 వద్ద ట్రేడవుతోంది.
రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ & గ్యాస్ స్టాక్‌లలో అధిక నష్టాలు కొనసాగుతున్నాయి. నిఫ్టీ ఆటో మాత్రమే లాభాల్లో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 0.41 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీ 0.6 శాతం నష్టపోయాయి.
స్టాక్ మార్కెట్లో నేడు జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్ అరంగేట్రం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల కళ్లన్నీ దీనిపైనే ఉన్నాయి. ఇక యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌కు సంబంధించిన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) తన రెండు రోజుల విధాన సమావేశాన్ని అక్టోబర్ 27-28 తేదీలలో నిర్వహిస్తోంది. అధికారిక వడ్డీ రేటు నిర్ణయం, విధాన ప్రకటన నేడు వెలువడనుంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


