న్యూఢిల్లీ: డాలరు బలపడటం, అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లు బలహీనపడటం తదితర అంశాలతో వెండి ధరలు మరింతగా పతనమయ్యాయి. 10 నెలల్లో తొలిసారిగా వెండి కేజీ ధర కీలకమైన రూ. 2 లక్షల లోపు స్థాయికి పడిపోయింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో మంగళవారం రేటు మరో రూ. 4,000 తగ్గి రూ. 1.98 లక్షలకు చేరింది.
మరోవైపు, 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి 10 గ్రాముల ధర సైతం రూ. 500 తగ్గి రూ. 1,45,800కి దిగి వచ్చింది. దేశీయంగా బంగారం ధరలు సమీప భవిష్యత్తులో హెచ్చుతగ్గులకు లోనవుతూ రూ. 1.40–1.44 లక్షల శ్రేణిలో తిరుగాడవచ్చని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ వీపీ జతిన్ త్రివేది తెలిపారు. అటు అంతర్జాతీయంగా ఔన్సు పసిడి ధర స్వల్పంగా తగ్గి 4,011.44 డాలర్లకు, వెండి 1% క్షీణించి రూ. 53.41 డాలర్లకు దిగి వచ్చాయి.


