అమెరికా నిర్ణయం.. బంగారం ధరలకు షాక్? | Gold Prices Slide as Investors Await US Fed Policy | Sakshi
Sakshi News home page

Gold Price: అమెరికా నిర్ణయం.. బంగారం ధరలకు షాక్?

Oct 27 2026 6:41 PM | Updated on Oct 27 2026 7:41 PM

Gold Prices Slide as Investors Await US Fed Policy

బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకోబోయే నిర్ణయానికి ముందు, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో పసిడి రేట్లు పతనమవుతున్నాయి. ఈ రోజు (అక్టోబర్ 27) ఎంసీఎక్స్‌ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.1,42,216కు పడిపోయింది. మధ్యాహ్నం 1:09 గంటల సమయంలో రూ.1,42,460 వద్ద ట్రేడవుతూ, గత ముగింపు ధరతో పోలిస్తే రూ.613 తగ్గింది. దీంతో బంగారం ధరలు మళ్లీ ఎటువైపు కదులుతాయన్న ఆసక్తి ఇన్వెస్టర్లలో నెలకొంది.

గత పది రోజుల్లోనే బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. అక్టోబర్ 14న 10 గ్రాముల ధర రూ.1,45,848 వద్ద ముగియగా.. మంగళవారం ఇంట్రాడేలో రూ.1,42,216కు పడిపోయింది. అంటే.. ఈ కాలంలో రూ.3,632 తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ బలపడటం, వడ్డీ రేట్లు ఎక్కువ కాలం అధిక స్థాయిలో కొనసాగవచ్చన్న అంచనాలు వంటివి బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. సాధారణంగా వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం కంటే, అధిక వడ్డీ రాబడి ఇచ్చే పెట్టుబడులపై ఆసక్తి పెరిగినప్పుడు పసిడికి డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్ వర్గాల దృష్టి అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంపైనే ఉంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కీలకంగా మారింది. ఈసారి రేట్లను యథాతథంగా ఉంచవచ్చని అంచనాలు ఉన్నప్పటికీ, డిసెంబర్‌లో వడ్డీ రేట్ల పెంపు ఉండే అవకాశంపై ఫెడ్ ఎలాంటి సంకేతాలు ఇస్తుందో ఇన్వెస్టర్లు గమనిస్తున్నారు.

ఇదీ చదవండి: బంగారంపై నడిచే రోజులు వస్తున్నాయ్!

భారతదేశంలో బంగారం ధరలు
ఇండియన్ మార్కెట్లో గోల్డ్ రేటు నేడు (మంగళవారం) గరిష్టంగా రూ.540 పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.143290 వద్దకు చేరింది. ఇక చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూడవచ్చు.

బంగారం ధరలు1
1/4

బంగారం ధరలు2
2/4

బంగారం ధరలు3
3/4

బంగారం ధరలు4
4/4

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement