జియో జోరు.. కొత్త కనెక్షన్లలో రికార్డు | Jio Airtel Telecom Subscriber Growth September 2026 | Sakshi
Sakshi News home page

జియో జోరు.. కొత్త కనెక్షన్లలో రికార్డు

Oct 28 2026 7:46 AM | Updated on Oct 28 2026 7:48 AM

Jio Airtel Telecom Subscriber Growth September 2026

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో సెప్టెంబర్‌లోనూ కొత్త మొబైల్‌ చందాదారుల చేరికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ నెలలో 27.13 లక్షల మంది కొత్త యూజర్లను చేర్చుకుంది. భారతీ ఎయిర్‌టెల్‌ 26.92 లక్షల మందిని, వొడాఫోన్‌ ఐడియా 5.50 లక్షల మందిని ఆకర్షించాయి. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ సైతం 6.26 లక్షల కొత్త మొబైల్‌ చందాదారులను చేర్చుకుంది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ మంగళవారం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

తాజా చేరికలతో సెప్టెంబర్‌ చివ రి నాటికి జియో మొత్తం మొబైల్‌ వినియోగదారుల సంఖ్య 51.11 కోట్లకు చేరింది. ఎయిర్‌టెల్‌ వినియోగదారుల సంఖ్య 49.43 కోట్లు కాగా, వొడాఫోన్‌ ఐడియా వినియోగదారులు 20 కోట్లకు పైగా ఉన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 9.43 కోట్లకు పెరిగింది. ట్రాయ్‌ గణాంకాల ప్రకారం..

»    మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల మార్కెట్‌లో జియో వాటా 39.32 శాతంగా ఉంది. ఎయిర్‌టెల్‌ 38.02 శాతం, వొడాఫోన్‌ ఐడియా 15.39 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 
»    ఆగస్టు చివరి నాటికి 129.34 కోట్లుగా ఉన్న మొత్తం వైర్‌లెస్‌ మొబైల్‌ వినియోగదారుల సంఖ్య సెప్టెంబర్‌ నాటికి దాదాపు 130 కోట్లకు చేరింది. నెలవారీగా 0.51% వృద్ధితో 65.74 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు చేరారు. 
»    మొబైల్, ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ కనెక్షన్లతో కలిపి వైర్‌లైస్‌ సబ్‌స్రై్కబర్ల సంఖ్య సెప్టెంబర్‌ చివరికి 131.92 కోట్లకు పెరిగింది.  
»    వైర్‌లైన్‌ కనెక్షన్లతో సహా దేశవ్యాప్తంగా మొత్తం టెలిఫోన్‌ చందాదారులు 136.79 కోట్లకు చేరారు. 
»    సెప్టెంబర్‌లో యాక్టివ్‌ వైర్‌లెస్‌ మొబైల్‌ చందాదారుల సంఖ్య 121.28 కోట్లుగా నమోదైంది. 
»    ఆగస్టులో 110.12 కోట్లుగా ఉన్న బ్రాడ్‌బ్యాండ్‌ చందాదారుల సంఖ్య సెపె్టంబర్‌లో 110.77 కోట్లకు పెరిగింది. నెలవారీ వృద్ధి 0.59 శాతంగా నమోదైంది. 
»    సెప్టెంబర్‌లో నెట్‌వర్క్‌ మారేందుకు మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ కోసం 1.68 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఎం2ఎం కనెక్షన్లు 
మెషిన్‌–టు–మెషిన్‌ సెల్యులార్‌ మొబైల్‌ కనెక్షన్లు ఆగస్టు చివరినాటికి 14 కోట్లుగా ఉండగా, సెప్టెంబర్‌ చివరికి 14.4 కోట్లకు పెరిగాయి. ఈ విభాగంలో 61.16 శాతం మార్కెట్‌ వాటాతో, 8.85 కోట్ల కనెక్షన్లతో భారతీ ఎయిర్‌టెల్‌ అగ్రస్థానంలో నిలిచింది. రిలయన్స్‌ జియో 19.29 శాతం, వొడాఫోన్‌ ఐడియా 16.14 శాతం, బీఎస్‌ఎన్‌ఎల్‌ 3.41 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement