అమ్మ బంగారం అమ్మి డబ్బులిస్తే ట్యాక్స్‌ కట్టాలా? | Mother Gifts Son Rs 16 Lakh Gold Sale ITAT Tax relief | Sakshi
Sakshi News home page

అమ్మ బంగారం అమ్మి డబ్బులిస్తే ట్యాక్స్‌ కట్టాలా?

Oct 28 2026 8:42 AM | Updated on Oct 28 2026 8:49 AM

Mother Gifts Son Rs 16 Lakh Gold Sale ITAT Tax relief

ఆదాయపు పన్నుకు సంబంధించిన వ్యవహారాలు ఓ పట్టాన అర్థం కావు. ఆదాయం ఎటువంటిదైనా పన్ను రాబట్టాలని చూస్తూరు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు. అయితే కాస్త అవగాహన ఉండి సరైన ఆధారలతో న్యాయపోరాటం చేస్తే పన్ను మినహాయింపు తప్పక పొందవచ్చని తెలియజేస్తోంది ఈ ఉదంతం..

జైపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఆదాయపు పన్ను అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఐటీఏటీ) ఊరటనిచ్చింది. తల్లి పాత బంగారు ఆభరణాలను విక్రయించి, ఆ డబ్బులో రూ.16 లక్షలను కుమారుడికి బహుమతిగా ఇచ్చినట్లు సమర్పించిన ఆధారాలను ట్రిబ్యునల్‌ పరిగణనలోకి తీసుకుంది. దీంతో బ్యాంకు ఖాతాలోని నగదు డిపాజిట్లకు సంబంధించి పన్ను శాఖ విధించిన రూ.13.04 లక్షల అదనపు ఆదాయాన్ని తొలగించింది. ఈ మేరకు ఐటీఏటీ జైపూర్‌ బెంచ్‌ 2026 అక్టోబర్‌ 6న తీర్పు ఇచ్చింది.

బంగారం అమ్మి కొడుకుకు నగదు బహుమతి

వివరాల్లోకి వెళ్తే.. 2012–13 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి సంబంధించి జైపూర్‌కు చెందిన ఝూతా రామ్‌ ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేయలేదు. దీంతో ఆయన స్థిరాస్తిలో రూ.20.23 లక్షలు పెట్టుబడి పెట్టడం, బ్యాంకు ఖాతాలో రూ.13.04 లక్షలు నగదు జమ చేయడంపై పన్ను శాఖ విచారణ చేపట్టింది. ఈ లావాదేవీలకు సరైన వివరణ లేదంటూ పన్ను అధికారులు అదనపు ఆదాయాన్ని లెక్కలోకి తీసుకున్నారు. అప్పీల్‌లో స్థిరాస్తి పెట్టుబడికి సంబంధించిన అదనపు పన్ను తొలగించినప్పటికీ, నగదు డిపాజిట్లపై విధించిన పన్ను మాత్రం కొనసాగింది.

దీంతో ఆయన ఐటీఏటీని ఆశ్రయించారు. విచారణ సందర్భంగా, తన తల్లి 642.300 గ్రాముల పాత బంగారు ఆభరణాలను రూ.16.10 లక్షలకు విక్రయించి, అందులో రూ.16 లక్షలను 2012 ఫిబ్రవరి 2న తనకు బహుమతిగా ఇచ్చినట్లు వివరించారు. ఇందుకు మద్దతుగా ఇద్దరు సాక్షుల సమక్షంలో నోటరీ చేసిన గిఫ్ట్‌ డీడ్‌, ఆభరణాల విలువను నిర్ధారించిన రిజిస్టర్డ్‌ వాల్యూయర్‌ నివేదికను సమర్పించారు.

తల్లి నుంచి బహుమతిపై పన్ను ఉంటుందా?

తల్లి నుంచి వచ్చిన నగదు బహుమతికి ఆధారాలు సరిపోతున్నాయని ట్రిబ్యునల్‌ అభిప్రాయపడింది. తల్లిదండ్రులు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం నిర్దేశించిన బంధువుల పరిధిలోకి వస్తారు. సెక్షన్‌ 56(2)(x) ప్రకారం అర్హులైన బంధువుల నుంచి అందుకున్న నగదు బహుమతులకు సాధారణంగా పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, బ్యాంకు ఖాతాలో జమ చేసిన డబ్బు మూలాన్ని అధికారులు ప్రశ్నించినప్పుడు తగిన ఆధారాలు చూపాల్సి ఉంటుంది.

ఈ కేసులో బహుమతి పత్రం, సాక్షుల ధ్రువీకరణ, బంగారం విలువకు సంబంధించిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న ఐటీఏటీ.. రూ.13.04 లక్షల నగదు డిపాజిట్లపై చేసిన అదనపు పన్ను విధింపును తొలగించింది. అయితే, ఈ తీర్పు ఆధారాలు లేని ప్రతి నగదు బహుమతికీ వర్తిస్తుందని భావించకూడదు. అలాగే, తల్లి బంగారు ఆభరణాలను విక్రయించడం వల్ల ఆమెకు ఏదైనా మూలధన లాభం వచ్చిందా, దానిపై పన్ను వర్తిస్తుందా అన్నది వేరుగా పరిశీలించాల్సిన అంశం.

ఇదీ చదవండి: ఇల్లు అమ్మితే వచ్చే లాభాలు.. ఎలా ఇన్వెస్ట్‌ చేయాలి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement