breaking news
mother gift
-
అమ్మ బంగారం అమ్మి డబ్బులిస్తే ట్యాక్స్ కట్టాలా?
ఆదాయపు పన్నుకు సంబంధించిన వ్యవహారాలు ఓ పట్టాన అర్థం కావు. ఆదాయం ఎటువంటిదైనా పన్ను రాబట్టాలని చూస్తూరు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. అయితే కాస్త అవగాహన ఉండి సరైన ఆధారలతో న్యాయపోరాటం చేస్తే పన్ను మినహాయింపు తప్పక పొందవచ్చని తెలియజేస్తోంది ఈ ఉదంతం..జైపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఊరటనిచ్చింది. తల్లి పాత బంగారు ఆభరణాలను విక్రయించి, ఆ డబ్బులో రూ.16 లక్షలను కుమారుడికి బహుమతిగా ఇచ్చినట్లు సమర్పించిన ఆధారాలను ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకుంది. దీంతో బ్యాంకు ఖాతాలోని నగదు డిపాజిట్లకు సంబంధించి పన్ను శాఖ విధించిన రూ.13.04 లక్షల అదనపు ఆదాయాన్ని తొలగించింది. ఈ మేరకు ఐటీఏటీ జైపూర్ బెంచ్ 2026 అక్టోబర్ 6న తీర్పు ఇచ్చింది.బంగారం అమ్మి కొడుకుకు నగదు బహుమతివివరాల్లోకి వెళ్తే.. 2012–13 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి జైపూర్‌కు చెందిన ఝూతా రామ్ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదు. దీంతో ఆయన స్థిరాస్తిలో రూ.20.23 లక్షలు పెట్టుబడి పెట్టడం, బ్యాంకు ఖాతాలో రూ.13.04 లక్షలు నగదు జమ చేయడంపై పన్ను శాఖ విచారణ చేపట్టింది. ఈ లావాదేవీలకు సరైన వివరణ లేదంటూ పన్ను అధికారులు అదనపు ఆదాయాన్ని లెక్కలోకి తీసుకున్నారు. అప్పీల్లో స్థిరాస్తి పెట్టుబడికి సంబంధించిన అదనపు పన్ను తొలగించినప్పటికీ, నగదు డిపాజిట్లపై విధించిన పన్ను మాత్రం కొనసాగింది.దీంతో ఆయన ఐటీఏటీని ఆశ్రయించారు. విచారణ సందర్భంగా, తన తల్లి 642.300 గ్రాముల పాత బంగారు ఆభరణాలను రూ.16.10 లక్షలకు విక్రయించి, అందులో రూ.16 లక్షలను 2012 ఫిబ్రవరి 2న తనకు బహుమతిగా ఇచ్చినట్లు వివరించారు. ఇందుకు మద్దతుగా ఇద్దరు సాక్షుల సమక్షంలో నోటరీ చేసిన గిఫ్ట్ డీడ్, ఆభరణాల విలువను నిర్ధారించిన రిజిస్టర్డ్ వాల్యూయర్ నివేదికను సమర్పించారు.తల్లి నుంచి బహుమతిపై పన్ను ఉంటుందా?తల్లి నుంచి వచ్చిన నగదు బహుమతికి ఆధారాలు సరిపోతున్నాయని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. తల్లిదండ్రులు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం నిర్దేశించిన బంధువుల పరిధిలోకి వస్తారు. సెక్షన్ 56(2)(x) ప్రకారం అర్హులైన బంధువుల నుంచి అందుకున్న నగదు బహుమతులకు సాధారణంగా పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, బ్యాంకు ఖాతాలో జమ చేసిన డబ్బు మూలాన్ని అధికారులు ప్రశ్నించినప్పుడు తగిన ఆధారాలు చూపాల్సి ఉంటుంది.ఈ కేసులో బహుమతి పత్రం, సాక్షుల ధ్రువీకరణ, బంగారం విలువకు సంబంధించిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న ఐటీఏటీ.. రూ.13.04 లక్షల నగదు డిపాజిట్లపై చేసిన అదనపు పన్ను విధింపును తొలగించింది. అయితే, ఈ తీర్పు ఆధారాలు లేని ప్రతి నగదు బహుమతికీ వర్తిస్తుందని భావించకూడదు. అలాగే, తల్లి బంగారు ఆభరణాలను విక్రయించడం వల్ల ఆమెకు ఏదైనా మూలధన లాభం వచ్చిందా, దానిపై పన్ను వర్తిస్తుందా అన్నది వేరుగా పరిశీలించాల్సిన అంశం.ఇదీ చదవండి: ఇల్లు అమ్మితే వచ్చే లాభాలు.. ఎలా ఇన్వెస్ట్ చేయాలి.. -
అమ్మ భయపడినట్టుగానే జరిగింది!
హైదరాబాద్: ఆ తల్లి భయపడినట్టుగానే జరిగింది. తన కుమారుడికి ఏదైతే జరగకూడదని ఆ తల్లి కోరుకుందే అదే జరిగింది. తాను కొనిచ్చిన కారు కన్నబిడ్డ పాలిట మృత్యుశకటంగా మారింది. బంజారాహిల్స్ లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వరూప్ నగర్ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన ముగ్గురు ఇంజనీరింగ్ పట్టభద్రులు మామిడాల తేజ(23), పల్లె శరత్ చంద్ర గౌడ్(23), తిరునహరి నరేన్ సాయి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన హొండా సిటీ కారు తేజకు తల్లి బహుమానంగా ఇచ్చింది. టూవీలర్స్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని భావించిన ఆమె తన కుమారుడికి కారు కొనిచ్చింది. అమ్మ తనకు ఇచ్చిన బహుమతి గురించి తేజ ఫేస్ బుక్ లో తన మిత్రులతో పంచుకున్నాడు. కారు ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అయితే తన తల్లి కొనిచ్చిన కారులోనే అతడు ప్రమాదానికి గురవడం విషాదం. విదేశాల్లో ఎంఎస్ చేయడానికి వెళతాడనుకున్న కొడుకు హఠాన్మరణం పాలవడంతో తేజ తల్లి అరుణ శోకసంద్రంలో మునిగిపోయారు. ఒక్కగానొక్క కుమారుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో నరేన్ సాయి తండ్రి రామస్వామి తల్లడిల్లుతున్నారు. గత సివిల్స్ పరీక్షలో ఒక్క మార్కుతో ర్యాంక్ కోల్పోయిన నరేన్... మళ్లీ అదే పట్టుదలతో పయత్నిస్తున్నాడు. కుమారుడి అకాల మరణంతో రామస్వామి దంపతులు గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు. మరో మృతుడు శరత్ చంద్ర ఎస్ఐ సెలక్షన్స్ కు, గ్రూప్స్ కు ప్రిపేరవుతున్నాడు. ఇంతలోనే ప్రమాదం బారినపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ముగ్గురు యువకుల మరణంతో ఫ్రెండ్స్ కాలనీలో విషాదం అలుముకుంది.


