two-wheelers sales
-
వాహనాలకు డిమాండ్ డౌన్
న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్లు సహా ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 7 శాతం క్షీణించినట్లు ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరిలో 20,46,328 వాహన విక్రయాలు నమోదు కాగా తాజాగా గత నెల 18,99,196 యూనిట్లకు తగ్గాయి. ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు 10 శాతం క్షీణించి 3,03,398 యూనిట్లకు పరిమితమయ్యాయి. టూ వీలర్ల విక్రయాలు 6 శాతం క్షీణించి 14,44,674 నుంచి 13,53,280 యూనిట్లకు తగ్గాయి. వాణిజ్య వాహనాలు 9 శాతం క్షీణించి 82,763 యూనిట్లకు, ట్రాక్టర్ల విక్రయాలు 14 శాతం తగ్గి 65,574 యూనిట్లకు పడిపోయాయి. నిల్వలపరంగా సమతౌల్యత లేకపోవడం, ధరలపరంగా మార్పులు, వినియోగదారుల్లో బలహీన సెంటిమెంట్, ఎంక్వైరీలు తగ్గిపోవడం, రుణ లభ్యత పరిమిత స్థాయిలోనే ఉండటం తదితర అంశాలు అమ్మకాల క్షీణతకు కారణమైనట్లు ఫాడా పేర్కొంది. ఎంట్రీ లెవెల్ కేటగిరీలో మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, కొనుక్కోవాలనుకునే ఆలోచన కొనుగోలు రూపం దాల్చడంలో జాప్యం జరుగుతుండటం, అలవికాని లక్ష్యాలు డీలర్లకు సమస్యాత్మకంగా ఉంటున్నాయని ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. ఇదే విషయాన్ని తయారీ సంస్థలకు తెలియజేశారని, తమపై భారీ నిల్వల భారం మోపడాన్ని నివారించాలని కోరారని వివరించారు. మార్చిలో అమ్మకాలపై ఆశావహంగా ఉన్నప్పటికీ డీలర్లు కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 50–52 రోజులకు సరిపడే నిల్వలు ఉంటున్నాయని పేర్కొన్నారు. -
కార్ల విక్రయాలకు బ్రేకులు
ముంబై: దేశీయ కార్ల విక్రయాలు వరుసగా మూడో నెలా నెమ్మదించాయి. డిమాండ్ క్షీణతతో వాహన నిల్వలు పెరిగాయి. వీటిని తగ్గించుకునేందుకు వీలుగా ఆటో కంపెనీలు డీలర్లకు వాహన పంపిణీ (డిస్పాచ్) తగ్గించాయి. దీంతో ఈ సెప్టెంబర్‌లోనూ ఆటో అమ్మకాలు అంతంత మాత్రంగా జరిగాయి.కార్ల దిగ్గజ సంస్థలు మారుతీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్ విక్రయాలు తగ్గాయి. ఇక ద్విచక్ర వాహనాలకొస్తే... ఈ విభాగంలోని అగ్ర కంపెనీలైన టీవీఎస్ మోటోకార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. వాణిజ్య, ట్రాకర్ల అమ్మకాలూ పెరిగాయి. పండుగ సీజన్ ప్రారంభం కావడంతో వాహన విక్రయాలు అమ్మకాలు పుంజుకునే వీలుందని ఆటో తయారీ సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. -
ఫిబ్రవరిలోనూ ‘రయ్ రయ్’
ముంబై: స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)కు ఆదరణ పెరగడంతో ఫిబ్రవరిలోనూ రికార్డు స్థాయిలో వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రాఅండ్‌మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్ కంపెనీల అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. మొత్తం 3.73 లక్షల ప్యాసింజర్ వాహన(పీవీ) విక్రయాలు జరిగాయి. తద్వారా పరిశ్రమ చరిత్రలో అత్యధిక పీవీలు అమ్ముడైన మూడో నెలగా ఫిబ్రవరి ఆవిర్భవించింది. ద్విచక్ర వాహనాలకూ డిమాండ్ కొనసాగింది. కాగా ట్రాక్టర్స్ అమ్మకాల వృద్ధిలో క్షీణత జరిగింది. -
కార్లకు శుభకాలం.. టూవీలర్స్‌కు గడ్డుకాలం
న్యూఢిల్లీ : డీమానిటైజేషన్ కాలంలో కార్ల విక్రయాలు పెరిగాయని, టూవీలర్స్ అమ్మకాలు తగ్గాయని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభకు తెలిపారు. నవంబర్, డిసెంబర్లు చాలా కఠినమైన నెలలని, కానీ డిసెంబర్ నెలలో ప్రత్యక్ష, పరోక్ష పన్నులు విపరీతంగా పెరిగినట్టు అరుణ్ జైట్లీ చెప్పారు. డీమానిటైజేషన్ తర్వాత లక్షల, కోట్ల నగదు, ఆర్బీఐకు తిరిగి వచ్చిందని పేర్కొన్నారు. ఎక్కువ క్యాష్ ఉన్న ఆర్థికవ్యవస్థలో మనం ఉన్నామని, ఇది పన్ను ఎగవేతకు, అవినీతికి, సమాంతర ఆర్థికవ్యవస్థకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. జీఎస్టీ అమలు తర్వాత దేశంలో మంచి, సమర్థవంతమైన పన్ను వ్యవస్థను రూపొందించవచ్చని అభిప్రాయం వ్యక్తంచేశారు. మౌలిక సదుపాయాలకు రూ.3,96,000 కోట్లను, రైల్వే భద్రతా ఫండ్‌గా రూ.1,00,000 కోట్లను వెచ్చించినట్టు తెలిపారు. ద్రవ్యోల్బణం టార్గెట్ 4 శాతంగా ఆర్బీఐ నిర్దేశించుకుందని, ప్రస్తుతం మనం 3.6 శాతంలో ఉన్నట్టు లోక్‌సభలో చెప్పారు.