సెమీకాన్‌ ఇండియా 2.0 పోర్టల్‌ ప్రారంభం  | Minister Ashwini Vaishnaw Launches Semicon 2. 0 Web Application Portal | Sakshi
Sakshi News home page

సెమీకాన్‌ ఇండియా 2.0 పోర్టల్‌ ప్రారంభం 

Nov 7 2026 5:05 AM | Updated on Nov 7 2026 5:05 AM

Minister Ashwini Vaishnaw Launches Semicon 2. 0 Web Application Portal

న్యూఢిల్లీ: దేశీయంగా సెమీకండక్టర్‌ పరికరాల తయారీ, ఫ్యాబ్రికేషన్‌ మొదలైన వాటిని ప్రోత్సహించడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా రూ. 1.27 లక్షల కోట్లతో తలపెట్టిన సెమీకాన్‌ ఇండియా 2.0 ప్రోగ్రాంకి సంబంధించి దరఖాస్తులు సమరి్పంచేందుకు ప్రత్యేక పోర్టల్‌ను కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రారంభించారు. సాంకేతికంగా గట్టి సామర్థ్యాలు ఉన్న సంస్థలనే పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. 

 అటు, ఎల్రక్టానిక్స్‌ కాంపొనెంట్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ స్కీము (ఈసీఎంఎస్‌) కింద మరో 12 ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసినట్లు మంత్రి వివరించారు. వీటితో రూ. 7,503 కోట్ల పెట్టుబడులు రాగలవని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు సుమారు రూ. 39,045 కోట్ల విలువ చేసే ఉత్పత్తులను తయారు చేయగలవని, 7,127 ప్రత్యక్ష ఉద్యోగాలు కలి్పంచగలవని పేర్కొన్నారు. తాజాగా అనుమతులు పొందిన వాటితో కలిపితే ఈసీఎంఎస్‌ కింద ఆమోదించిన దరఖాస్తుల సంఖ్య 118కి చేరింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement