breaking news
paralysed
-
ఎవడ్రా వీడు..మరి ఇంత టాలెంటెడా..?! .
శరీరంలో ఏ అయవం కదలదు అంటే..ఎవ్వరైనా చతికిలపడిపోతారు. జీవితమే లేదు అన్నంతగా బాధపడిపోతారు. కానీ అతడి శరీరంలో ఏ చిన్న అవయవం కదిలిన చాలు..అద్భుతం చేయొచ్చు అనుకున్నాడు. ఆ దృఢ సంకల్పమే జస్ట్ ఒకేఒక చేతి వేలు, కాలి బొటనవేలుతో అద్భుతమే సృష్టించి తన కుటుంబానికి ఆసరాగానే కాదు..టెక్నాలజీ తెలియని అమ్మను అన్ని నేర్చుకునేలా చేసి ముందుండి నడుపించిన గొప్ప కొడుకు అతడు. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉన్న ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు సంపదతో పనిలేదు అని చెప్పే ప్రేరణాత్మక స్టోరీ..!.36 ఏళ్ల లి జియా, నైరుతి చైనాలోని చాంగ్‌కింగ్‌కు చెందిన వ్యక్తి. అతను కేవలం ఐదేళ్ల ప్రాయంలో కండరాల బలహీనత ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. అనారోగ్యం కారణంగా ఐదోతరగతితోటే పాఠశాల చదువుకి స్వస్తి పలకాల్సి వచ్చింది. అయితే చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చినా..చదవడం, రాయడం మాత్రం లీ కొనసాగించడం విశేషం. స్వీయంగా చదువుకోవడం ప్రారంభించాడు. అతనికి కంప్యూటర్ సైన్స్, భౌతిక శాస్త్రం అంటే మహా ఇష్టం. కంప్యూటర్ని తనకు పరిచయం చేసిన వ్యక్తి అతడి చెల్లెలు. పాఠశాల నుంచి తెచ్చే పుస్తకం ద్వారా కంప్యూటర్‌పై మక్కువ ఏర్పడటం మొదలైంది. పుస్తకంలో ప్రతి అధ్యయం అతడికి ఆకర్షణీయంగా కనిపించేది. ప్రతి కొత్త విద్యాసంవత్సరంలో ఏ కొత్త కంప్యూటర్ పుస్తకం విడుదలవుతుందో అని ఆసక్తిగా ఎదురుచూసేవాడు. అంత ఇష్టం కంప్యూటర్ అంటే. వాటిని పదేపదే క్షణ్ణంగా చదివేవాడు. ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌ల సాయంతో ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. అయితే ఒకపక్క లీ పరిస్థితి దారుణంగా దిగజరిపోవడం ప్రారంభించింది. నడిచే సామర్థ్యాన్నికోల్పోయాడు. ఆ తర్వాత తినడం, శ్వాస తీసుకోవడం వంటివన్నీ సమస్యాత్మికంగా మారిపోయాయి. కేవలం ఒక చేతి వేలు, కాలి బొటనవేలు మాత్రమే కదిలించగలిగేవాడు. అంతేగాదు 2020లో కోమాలోకి వెళ్లిపోయాడు కూడా. వైద్యులు ట్రాకియోటమీ చేసి, బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు కూడా. ఆ సమయంలో అతడి జీవితం అత్యంత కటిక చీకటి అలుముకున్న క్లిష్టతరమైన సమయంగా పేర్కొనవచ్చు. అయితే 2021 ప్రారంభంలో లీ నేలలేని స్మార్ట్ వ్యవసాయం గురిచి తెలుసుకున్నాడు. అది అతడికి కొండంత ధైర్యాన్ని, భరోసాని ఇంచ్చింది. ఆధునిక వ్యవసాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీని అనుసంధానించాలనే ఆలోచనను ఆచరణలో పెట్టాలని స్ట్రాంగ్ఆ నిర్ణయించుకున్నాడు.ఆఖరికి వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు కూడా, అతను ఒక వేలు మరియు ఒక కాలి బొటనివేలితో వర్చువల్ కీబోర్డ్‌ను ఆపరేట్ చేస్తూ.. పూర్తి స్మార్ట్ ఫామ్ కంట్రోల్ సిస్టమ్‌ను విజయవంతంగా సృష్టించాడు. 2017లో అతని తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత లీ తల్లి వు డిమెయ్ అతని సంరక్షణ బాధ్యతను తీసుకుంది. ప్రతి శారీరక పనిలోనూ కొడుకు సూచనలను అనుసరించేది. అలా కాలక్రమేణ తనకు అస్సలు తెలియని సాంకేతిక నైపుణ్యాలను సులభంగా ఒడిసిపట్టిందామె. సర్క్యూట్లు గురించి తెలియకపోయినా.. కంట్రోల్ బోర్డులను సోల్డరింగ్ చేయడం, నెట్వర్క్ వైరింగ్‌ను ఇన్స్టాల్ చేయడం, సర్క్యూట్లను అసెంబుల్ చేయడం, వ్యవసాయ పరికరాలను నిర్వహించడం వంటి వాటిల్లో మంచి నైపుణ్యం సాధించింది. తన కుమారుడు లీ మార్గదర్శకత్వంలో తల్లి వు మాన్యువల్‌గా రిమోట్ కంట్రోల్డ్ డ్రైవర్‌లెస్ వాహనాన్ని కూడా నిర్మించింది. ఇది వారి ఉత్పత్తులను డెలివరీలు చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేగాదు అతడి తల్లి వుకి సాంకేతిక సూత్రాలు ఏమి తెలియకపోయినా..వైర్లను ఎలా కనెక్ట్ చేయాలని, సిస్టమ్‌ని ఎలా సెటప్ చేయాలో ఆమెకు తెలుసు. ఇక లీ నిర్మించిన స్మార్ట్ వ్యవసాయం విజయవంతంగా నడుస్తోంది, లాభాలను ఆర్జిస్తోంది. ప్రస్తుతం అతడి జీవితం ఒక కొత్త విజయవంతమైన అధ్యయనానికి నాంది పలికింది. బాల్యమంత అనారోగ్యమయంతో గడిపినా..కనీసం శరీరంలో ఏ భాగాలు కదిలించలేకపోయినా..కేవలం వేళ్ల సాయంతో తన జీవితాన్ని అందంగా నిర్మించాలనుకోవడం మాములు టాలెంట్ కాదు కదూ..!. ఎంత కష్టమైనా సరే ఎదిగే చిన్న అవకాశం చాలు..ఉవ్వెత్తున ఎగిసిపడే స్థాయికి..చేరి విజయాన్నిపాదాక్రాంతం చేసుకోవచ్చని ప్రూవ్ చేశాడు..ఎందరికో అతడి కథ స్ఫూర్తిని కలిగించడమే గాక, మనసుని తాకింది కూడా.(చదవండి: 91 ఏళ్ల తల్లి అవధులులేని ప్రేమ..! మంచానికి పరిమితమై కూడా..) -
వెన్నుముక మార్పిడి... వైద్య శాస్త్రంలో సరికొత్త అధ్యయనం!..
Paralysed Man Walks Again: ఇంతవరకు పంది గుండె, కిడ్ని వంటివి మానవుడికి అమర్చడం వంటి సరికొత్త వైద్యా విధానాలను గురించి తెలుసుకున్నాం. పైగా అవయవాల కొరతను నివారించే ప్రక్రియలో భాగంగా జరిగిన సరికొత్త వైద్యా విధానాలుగా పేర్కొనవచ్చు. అయితే ఇంతవరకు మనం వెన్నముక ఇంప్లాంటేషన్(మార్పిడి) గురించి వినలేదు. వెన్నముకకి గాయాలై శరీరం చచ్చుబడి పోయి మంచానికి పరిమితమైన వారికి ఈ ఇంప్లాంటేషన్ వరం. అసలు విషయంలోకెళ్తే...వెన్నముకకు గాయాలవ్వడంతో మంచానికి పరిమితమైన వాళ్లు మళ్లీ తాము జీవితంలో లేచి నిలబడలేమని నిరాశ నిస్ప్రహలకి లోనవ్వాల్సిన అవసరంలేదంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఎలక్ట్రికల్ పల్స్‌తో కూడిన వెన్నముక సాయంతో రోగులు నిలబడటమే కాక వ్యాయమాలు కూడా చేయగలరని అంటున్నారు. వెన్నుమక గాయం కారణంగా కాళ్లు చేతులు పక్షవాతానికి గురైన వాళ్లు సైతం లేచి నిలబడగలరిని ధీమాగా చెబుతున్నారు వైద్యులు. 2017లో మిచెల్ రోకాటి మోటర్‌బైక్ ప్రమాదంలో వెన్నముకకు అయిన గాయం కారణంగా దిగువ శరీర భాగం చచ్చుబడిపోయింది. అయితే రోకాటి ఎలక్ట్రికల్ పల్స్‌తో కూడిన వెన్నుముక ఇంప్లాంటేషన్‌తో అడుగులు వేయగలిగారని నేచర్ మెడిసిన్ జర్నల్ పేర్కొంది. అంతేకాదు ఇలాంటి సమస్యతో బాధపడుతున్న ముగ్గరు రోగులు ఈ ఎక్ట్రికల్ పల్స్‌తో కూడిన వెన్నముక ఇంప్లాంటేషన్ సాయంతో తమ శరీరాన్ని కదిలించగలిగారని తెలిపారు. ఆరు సెంటీమీటర్ల ఇంప్లాంట్‌ను చొప్పించి, పల్స్‌ను చక్కగా ట్యూన్ చేసిన కొద్దిసేపటికే ముగ్గురులో కదిలికలను గుర్తించాం అని అన్నారు. ఈ ఎలక్ట్రోడ్లు ఇంతకుముందు అమర్చిన వాటి కంటే పొడవుగా, పెద్దవిగా ఉంటాయని తెలిపారు. ఇవి కండరాలను యాక్సెస్ చేయగలవని జపాన్ లాసాన్ యూనివర్శిటీ హాస్పిటల్‌లోని న్యూరో సర్జన్ జోసెలిన్ బ్లాచ్ చెప్పారు. అంతేకాదు ప్రారంభ దశలో కదిలించటానికి తమ ముందు శరీర భాగాంలో కొంత బలం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రోగి ప్రాక్టీస్ చేయడం ద్వారా నిలబడటం, నడవటం వంటివి చేయగలుగుతారన్నారు. అంతేకాదు దాదాపు కిలోమీటర్ దూరం వరకు నడవగలుగుతారని చెప్పారు. పక్షవాతాన్ని పరిష్కరించడానికి ఎలక్ట్రికల్ పల్స్‌లను ఉపయోగించాలనే ఆలోచన నొప్పిని నియంత్రించడానికి ఉపయోగించే సాంకేతికత నుండి ఉద్భవించిందని తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ పల్స్ కంప్యూటర్ ద్వారా యాక్టివేట్ అవుతుంటాయి. వీటిని రోజు రోగి యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కొంతమంది ఈ ఎలక్ట్రిక్ పోల్స్‌ని యాక్టివేట్ చేయకుండా కూడా అవయవాలను కదిలించగలిగారని కానీ పూర్తిగా మాత్రం సాధ్యం కాదని న్యూరో సర్జన్లు చెబుతున్నారు. ఈ ఏడాది యునైటెడ్ స్టేట్స్ యూరప్‌లో సుమారు 50 నుంచి100 మంది రోగులపై ట్రయల్స్ నిర్వహించనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. -
ఈ ఏనుగు కథ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది
మానవులే చిన్న చిన్న సమస్యలు వస్తే కంగారు పడిపోతాం. ఏదైన వ్యాధి బారినపడితేనే చాలా ఆందోళనకు గురి అవుతాం. మన బంధువులు, స్నేహితులు ధైర్యం చెబితే గానీ కుదుటపడం అలాంటి ఒక చిన్న జంతువు పిల్ల అయితే ఎంత భయపడుతోందో కదా. కానీ ఇక్కడ ఉన్న ఈ అనాథ ఏనుగు పిల్ల కెర్రియో ఎంతో ధైర్యంగా తనకు వచ్చిన వ్యాధిని ఎదుర్కొంటుంది.. (చదవండి: అతి పెద్ద నిధి.. 30 ఏళ్లుగా పరిశోధన!) పాపం దాని కాళ్లకు పక్షవాతం వచ్చి నిస్తేజంగా ఉండిపోతుంది. కానీ అది దాని సంరక్షకుని సాయంతో ఆ వ్యాధిని జయించడానికి ప్రయత్నించటమే కాక ఏవిధంగానైనా నడవాలని సంకల్పించుకుంటుంది. ఆఖరికి దాని ఉక్కు సంకల్పం ముందు ఆ వ్యాధి పరారై పోయింది. ఎంతో ఉత్సాహంగా నడవడానికి ప్రయత్నిస్తుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఏ విధంగానైనా జీవితాన్ని కొనసాగించాలనే దాని సంకల్పం గొప్పది అంటూ రకరకాలుగా ట్వీట్‌చేశారు. (చదవండి: ఛీ నా ఇల్లంతా పాడుచేసి....మొత్తం తినేసింది) Kerrio’s iron-clad will to get on with life is inspirational. This orphaned #elephant was rescued with paralysis in her hind legs. But as you can see, she is becoming stronger and more mobile with each passing day. Read her story: https://t.co/A7q5XCiH5W pic.twitter.com/ngtrwFmTIf — Sheldrick Wildlife (@SheldrickTrust) November 2, 2021 -
సెల్ఫీ పిచ్చితో ఇద్దరు అమ్మాయిలు..
పనాజీ: సెల్ఫీ పిచ్చితో కొందరు ప్రాణాలు తీసుకోగా.. మరికొందరు కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నారు. గోవాకు విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు అమ్మాయిలు సెల్ఫీ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇద్దరూ తీవ్రంగా గాయపడి పక్షవాతానికి గురయ్యారు. గోవా తీర ప్రాంతం అంజునా సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు అమ్మాయిలు స్కఫోల్డింగ్పై కూర్చునే సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే స్కఫోల్డింగ్ కూలిపోవడంతో ఇద్దరూ చాలా ఎత్తుపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అమ్మాయిలు ఇద్దరికీ వెన్నెముకకు తీవ్రగాయమైంది. నడుము కింది భాగాలు పక్షవాతానికి గురయ్యాయి. తీవ్రంగా గాయపడినా ఇద్దరూ బతికేఉన్నారని వైద్యులు చెప్పారు. వారి వివరాలను వెల్లడించలేదు. -
ఏడేళ్ల వయసులో 'తండ్రి' అయ్యాడు
బీజింగ్: చైనాకు చెందిన ఓ ఏడేళ్ల కుర్రవాడు తండ్రికే తండ్రి అయ్యాడు.. కాదు కాదు..తల్లీతండ్రీ అన్నీ తానే అయ్యాడు. వెన్నుముకకు దెబ్బతగిలి అచేతనంగా మారిపోయిన తండ్రిని అహర్నిశలూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు చైనాలోని గిజువా ప్రావిన్స్ లో ఉండే యాంగ్ ఓ యాంగ్లిన్. 2013లో యాంగ్లిన్ తండ్రి తమ ఇంటి రెండవ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కిందిపడిపోయాడు. దీంతో అతని వెన్నుముక దెబ్బతిని పక్షవాతానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. ఉన్న డబ్బంతాఅతని వైద్యానికి ఖర్చయిపోయింది. అతని భార్య మూడేళ్ల పాపను తీసుకొని ఎటో వెళ్లిపోయింది. దీంతో ఏడేళ్ల బాలుడు యాంగ్లీ , అచేతనంగా మారిన అతని తండ్రి మాత్రమే మిగలడంతో బాధ్యతలను నెత్తికెత్తుకోక తప్పలేదు యాంగ్లీకి. ఉదయం ఆరుగంటలకు లేచి వంట చేసి, స్కూలుకు వెళ్లడానికి ముందే తండ్రి టిఫిన్ తినిపించి, మందులు వేస్తాడు. మధ్యాహ్నం స్కూలు నుంచి ఇంటికి వచ్చి తండ్రికి భోజనం తినిపిస్తాడు. కుటుంబాన్ని పోషించుకునే పనిలో భాగంగా చెత్త ఏరడానికి వెళతాడు. దీని ద్వారా వచ్చే కొద్ది మొత్తంతో తండ్రి వైద్య ఖర్చులతో ఖర్చు కాగా, అలాగే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంత చిన్న వయసులో అతనికి ఆటాపాటాకు లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచీ, వంట, నాన్న పోషణ, స్కూలు, పని. ఆ తర్వాత అచేతనంగా మారిపోయిన అతని వెన్నుముకకు ఆయిల్ రాసి మర్దనా చేయడం కూడా అతని దినచర్యలో భాగం. గత సంవత్సన్నర కాలంగా ఈ పనుల్లో ఎక్కడా లోపం రాకుండా అటు చదువును, ఇటు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అటు భరించలేని నొప్పితో నిత్యం నరకం అనుభవిస్తున్న తండ్రి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే ముక్కుపచ్చలారని ఏడేళ్ల పసిప్రాయంలో కొడుకు తనకోసం పడుతున్న తపన చూసి ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఎంతటి బాధనైనా తన తండ్రిలాంటి కొడుకు కోసం పంటి బిగువున ఓర్చుకుంటున్నాడు.


