breaking news
Moti
-
హీరోయిన్ను బాడీ షేమింగ్ చేసిన తేజ్.. లాలూను గుర్తుచేసిన నటి!
ముంబై: ‘రైజ్ అండ్ ఫాల్’ రియాలిటీ షో తొలి ఎపిసోడ్లో బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డిజైనర్ చీర, బ్లౌజ్‌తో షోలోకి వచ్చిన ఆమె.. బాడీ షేమింగ్, ట్రోలింగ్‌పై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆమె ధరించిన బ్లౌజ్‌పై ‘మోటీ’ అని రాసి ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది.షోలో బీహార్ రాజకీయ నేత తేజ్ ప్రతాప్ యాదవ్.. స్వరా భాస్కర్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ క్రమంలో తేజ్ ప్రతాప్ ఆమెను ‘మోటీ’ అని సంబోధించారు. దీనిపై స్వరా కూడా తనదైన శైలిలో స్పందిస్తూ మాటలతో చమత్కరించారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ షోలో నవ్వులు పూయించింది.బాడీ షేమింగ్ గురించి స్వరా భాస్కర్ మాట్లాడుతూ.. తన శరీరాకృతిపై గతంలో వచ్చిన విమర్శలు, ట్రోలింగ్‌ను ప్రస్తావించారు. తనపై ఎలాంటి వ్యాఖ్యలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటానని ఆమె అన్నారు. షోలో ఆమె మాట్లాడిన తీరు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.ఇదే సమయంలో తేజ్ ప్రతాప్‌తో జరిగిన సంభాషణలో స్వరా భాస్కర్ ఆసక్తికరంగా స్పందించారు. తనను లాలూ ప్రసాద్ యాదవ్‌కు పరిచయం చేయాలని ఆమె కోరారు. దీంతో షోలో తేజ్ ప్రతాప్, స్వరా మధ్య జరిగిన సరదా మాటామంతీ చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: మారిన మందు.. ఐదుగురు చిన్నారులు ఐసీయూలో.. -
ప్రేమకు వెల కట్టిన పెద్దమనుషులు
మనస్తాపంతో యువతి ఆత్మహత్యాయత్నం వర్ధన్నపేట టౌన్ : ప్రేమించినవాడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడమేగాక, పెద్దమనుషులు కూడా పంచాయతీలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు చెప్పడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి క్రిమిసంహారక మందు తాగిన సంఘటన మండలంలోని డీసీ తండా శివారు గుబ్బెడ తండాలో శుక్రవారం జరిగింది. బాధితురాలు, తల్లిదండ్రుల కథనం ప్రకారం.. తండాకు చెందిన గుగులోతు రేణుక, అదే తండాకు చెందిన బానోతు మోతి ప్రేమించుకున్నారు. ఇటీవల మోతి ముఖం చాటేశాడు. అతడిని నిలదీసిన ఫలితం లేకపోవడంతో రేణుక కుటుంబ సభ్యులు పెద్దమనుషులను ఆశ్రయించారు. వారు కూడా పెళ్లికి బదులుగా ఆమెకు రూ.40 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, పెద్ద మనుషులకు ఖర్చల కోసం రూ.10 వేలు ఇవ్వాలని తీర్పు చెప్పారు. ఈ తీర్పుతో తీవ్ర మనస్తాపానికి గురైన రేణుక శుక్రవారం ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వర్ధన్నపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.


