మైత్రి బ్యానర్‌లో కోలీవుడ్ హీరో.. మరో హిట్ కొడతారా? | Kollywood actor Soori Acts In Mythri Movie Makers banner | Sakshi
Sakshi News home page

Mythri Movie Makers: మైత్రి బ్యానర్‌లో కోలీవుడ్ హీరో.. మరో హిట్ కొడతారా?

Oct 16 2026 8:21 AM | Updated on Oct 16 2026 8:55 AM

Kollywood actor Soori Acts In Mythri Movie Makers banner

టాలీవుడ్‌లో భారీ చిత్రాల  చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఇప్పుడు తమిళంలోనూ వరుస చిత్రాలు నిర్మిస్తోంది. ఈ సంస్థ గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే మంచి కమర్షియల్‌ హిట్‌ను అందుకుంది. ఆ తర్వాత డ్యూడ్, మొద రాత్రి, ఇరుముడి మొదలగు చిత్రాలను నిర్మించి విజయాలను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సంస్థ అధినేతలు నవీన్‌ యేర్నేని, వై.రవిశంకర్‌ తమిళంలో మరో చిత్రానికి సిద్ధమయ్యారు. ఇటీవల మండాడి మూవీతో మెప్పించిన సూరి హీరోగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఇటీవల మండాడి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నటుడు సూరి కథా నాయకుడిగా నటిస్తున్న 7వ చిత్రమిది. ఇండ్రు నేట్రు నాళై, అయిలాన్‌ వంటి సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు రవికుమార్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో సూరికి జంటగా నటి రజీషా విజయన్‌ నటిస్తున్నారు. నటుడు శివకార్తికేయన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ముహూర్తం షాట్‌కు క్లాప్‌ కొట్టగా, నిర్మాత ఎల్‌ రెడ్‌ కుమార్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన నవీన్‌ యేర్నేని మాట్లాడుతూ మేము తమిళంలో నిర్మించిన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ, డ్యూడ్, మొద రాతిరి, ఇరుముడి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో ఇక్కడ మరిన్ని చిత్రాలు చేయాలన్న ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు నటుడు సూరి హీరోగా చిత్రం చేస్తున్నాం. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుడు శివకార్తికేయన్, నిర్మాత ఎల్‌ రెడ్‌ కుమార్‌ తదితర సినీ ప్రముఖులకు ధన్యవాదాలు' అని పేర్కొన్నారు.

దర్శకుడు రవికుమార్‌ మాట్లాడుతూ మైత్రీ మూవీస్‌ సంస్థలో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు. నటుడు సూరి ఇప్పుడు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. ఆయన ప్రతిభను, అభిమానుల అంచనాలను పూర్తి చేయడంలో తన బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement