సైలెంట్‌గా వచ్చి రూ. 150 కోట్లు కొల్లగొట్టిన తమిళ సినిమా | Soori, Suhas Film Mandaadi Reaches RS 150 Crore Worldwide | Sakshi
Sakshi News home page

సైలెంట్‌గా వచ్చి రూ. 150 కోట్లు కొల్లగొట్టిన తమిళ సినిమా

Oct 7 2026 2:38 PM | Updated on Oct 7 2026 2:52 PM

Soori, Suhas Film Mandaadi Reaches RS 150 Crore Worldwide

తమిళ నటుడు సూరి, తెలుగు హీరో సుహాస్‌  ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మండాడి’. ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ తమిళ చిత్రంలో సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి సెప్టెంబర్ 10న రిలీజ్ చేసింది. తమిళ, తెలుగు భాషల్లోనే కాకుండా రిలీజ్ చేసిన అన్ని చోట్లా ‘మండాడి’కి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి తమిళనాడులో వంద కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా లెక్కల్ని చూసుకుంటే రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది.  సూరి, సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా ‘మండాడి’ నిలిచింది.

‘మండాడి’ సినిమాలోని బోట్ సీక్వెన్స్, రేసింగ్ సీన్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘మండాడి’ సినిమాకి కథిర్ అందించిన విజువల్స్, జీవీ ప్రకాష్ బీజీఎం, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలెట్‌గా నిలిచాయి. సూరి, సుహాస్ నటన, వారి పాత్రలు సినిమాని నిలబెట్టాయి. ఇక ఈ చిత్రాన్ని వీక్షించి రజినీకాంత్, వెట్రిమారన్ వంటి వారు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement