'సూరి'కి బర్త్‌డే విషెష్‌ చెప్పిన టాప్‌ హీరోయిన్‌.. ఫోటో వైరల్‌ | Top Actress Birthday Wishes To Actor Soori | Sakshi
Sakshi News home page

'సూరి'కి బర్త్‌డే విషెష్‌ చెప్పిన టాప్‌ హీరోయిన్‌.. ఫోటో వైరల్‌

Aug 28 2025 9:06 AM | Updated on Aug 28 2025 9:06 AM

Top Actress Birthday Wishes To Actor Soori

తమిళ నటుడు సూరి ఒకప్పుడు రోజుకూలీగా పని చేశారు. ఇదే విషయాన్ని గతంలో ఆయన చెప్పారు. కేవలం రూ. 20 కోసం రోజంతా కష్టపడేవాడినని ఆయన తెలిపారు. హాస్యనటుడిగా ఉన్న సూరిని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు వెట్రిమారన్ 'విడుదలై' సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ భారీ విజయం అందుకోవడం కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సూరి మార్కెట్‌ భారీగా పెరిగిపోయింది. ఆగష్టు 27న సూరి పుట్టినరోజు కావడంతో స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ శుభాకాంక్షలు చెబుతూ ఒక ఫోటో పంచుకుంది.

'సూరి'కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ కీర్తి సురేష్‌ పంచుకున్న ఫోటో నెట్టింట వైరల్‌ అవుతుంది. 'లవ్‌ యూ డా తంగాచ్చి (సోదరి)' అంటూ సూరి కూడా ఆమెకు కృతజ్ఞతలు తెలిపాడు. గతంలో వారిద్దరూ కలిసి కొన్ని సినిమాలకు పనిచేశారు. మామన్నన్ (2023)లో విడుదలైన ఈ మూవీలో నటించారు. కీర్తి సురేష్‌ తనకు దేవుడు ఇచ్చిన చెల్లెలు అంటూ సూరి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

1998లో తమిళ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన సూరికి మొదట పెద్దగా గుర్తింపు లేని పాత్రలే దక్కాయి. అయితే, 2009లో విడుదలైన 'వెన్నిల కబాడి కుజు' చిత్రం తనకు గుర్తింపు తెచ్చింది. సుమారు పదేళ్ల పాటు తన కష్టానికి ఫలితం దక్కింది.  ఈ మూవీతోనే తనకు 'పరోట్ట సూరి' అనే గుర్తింపు వచ్చింది. ఇక దర్శకుడు వెట్రిమారన్‌ సినిమా వల్ల తన జీవితమే మారిపోయింది. ఆ తర్వాత గరుడన్, మామన్ వంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం 'మందాడి' అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో తెలుగు నటుడు సుహాస్ తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement