
కోలీవుడ్ కమెడియన్ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం గరుడన్. విడుదలై మూవీతో హీరోగా ఆకట్టుకున్న కమెడియన్ సూరి లీడ్ రోల్‌లో నటించారు. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ రాసిన స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. అక్కడ హిట్ కావడంతో తెలుగులోనూ భైరవం పేరుతో రీమేక్ చేసి ఇటీవలే విడుదల చేశారు. తెలుగు వర్షన్‌లో మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పటికే గరుడన్ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని మరో ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సన్ నెక్ట్స్ వేదికగా గరుడన్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో సూరితో పాటు శశి కుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. ఈ రూరల్ యాక్షన్ డ్రామాకు ఆర్ఎస్ దురైసెంథిల్ కుమార్ డైరెక్ట్ చేశాడు.
Power, loyalty, betrayal – when friends turn foes, the fight becomes deadly.
Garudan is coming to SunNXT on August 1. Are you ready for the storm?#GarudanOnSunNXT #Garudan #TamilCinema #PowerAndBetrayal #SunNXT #ActionDrama pic.twitter.com/wrcLo57YRF— SUN NXT (@sunnxt) July 28, 2025