స్టార్ హీరో సంక్రాంతి సినిమా.. డైరెక్ట్‌గా ఓటీటీకి వచ్చేస్తోంది! | Kollywood Star Hero Sivakarthikeyan Ayalaan Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Ayalaan Movie: థియేటర్‌కు రాకుండానే ఓటీటీకి అయలాన్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Tue, Feb 6 2024 7:40 PM | Last Updated on Tue, Feb 6 2024 8:18 PM

Kollywood Star Hero Ayalaan Movie Ott Streaming Date Fix goes Viral - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం అయలాన్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా తమిళంలో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్‌ చేయాలని భావించారు.  మొదట ఈ మూవీని జనవరి 26న టాలీవుడ్ ప్రేక్షకులను అందుబాటులోకి తీసుకు రావాలని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కూడా నిర్వహించారు. కానీ కానీ ఊహించని విధంగా తెలుగు బాక్సాఫీస్ బరి నుంచి తప్పుకుంది.

(ఇది చదవండి: పవర్‌ఫుల్‌ పాత్రలో ఆదా శర్మ.. మరో కాంట్రవర్సీ అవుతుందా?)

అయితే ఈ చిత్రం ఓటీటీలోనే డైరెక్ట్‌గా రిలీజ్‌ చేయనున్నారని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. అనుకున్నట్లుగానే తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తోంది. ఈనెల 9 నుంచి సన్ నెక్ట్స్‌ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. దీంతో తమ అభిమాన హీరో మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement