ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు! | Sakshi
Sakshi News home page

This weekend Ott Release Movies: ఓటీటీ ప్రియులకు వీకెండ్ ట్రీట్.. ఆ మూడు సినిమాలే స్పెషల్!

Published Wed, Feb 7 2024 9:28 PM

This weekend Ott Release Movies List Goes Viral - Sakshi

మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఎప్పటిలాగే శుక్రవారం వస్తోందంటే చాలు ఏ సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయన్న దానిపై ఆసక్తితో ఉంటారు ఆడియన్స్. అలాగే ఓటీటీలోనూ ఏయే సినిమాలు వస్తున్నాయో అని ఎదురు చూస్తుంటారు. అయితే ఈ వారంలో పెద్ద సినిమాల సందడి చేయనున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సినిమాలు ఓటీటీకి రిలీజ్‌కు సిద్ధమైపోయాయి.

సంక్రాంతి రిలీజైన సినిమాల్లో ఇప్పటికే సైంధవ్‌ స్ట్రీమింగ్ అవుతుండగా.. మహేశ్ బాబు గుంటూరు కారం, ధనుశ్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ ‍అయలాన్ ఈ వీకెండ్‌లో అలరించనున్నాయి. వీటితో పాటు భూమి పెడ్నేకర్ భక్షక్ క్రైమ్ థ్రిల్లర్, సుస్మితా సేన్ ఆర్య వెబ్ సిరీస్ కూడా వచ్చేస్తున్నాయి. మరీ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఓ లుక్కేయండి. 

అంతే కాకుండా ఈ వారం థియేటర్లలో సందడి చేసేందుకు మాస్ మహారాజా రవితేజ ఈగల్ వచ్చేస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం ఈనెల 9న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వస్తున్న యాత్ర-2 ఈ వారంలోనే థియేటర్లకు రానుంది. ఈనెల 8న యాత్ర-2 థియేటర్లలో విడుదలవుతోంది. 
 

నెట్‌ఫ్లిక్స్

 •      వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08
 •      గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09
 •      భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్‌ )- ఫిబ్రవరి 09 
 •      లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09
 •      యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09
 •      ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09
 •      ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09
 •      హారిబుల్ బాసెస్ - ఫిబ్రవరి 10
 •      బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11

అమెజాన్ ప్రైమ్

 •     కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)-ఫిబ్రవరి 09 

డిస్నీప్లస్ హాట్‌ స్టార్‌

 •     ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-09

జీ5

 •  కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09

జియో సినిమా

 • హలో (వెబ్‌ సిరీస్‌) - ఫిబ్రవరి 8

సన్‌ నెక్ట్స్‌

 • అయలాన్- (తెలుగు డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి 09

Advertisement
 
Advertisement
 
Advertisement