స్టార్ హీరో కొత్త సినిమా.. తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానుందా? | Sivakarthikeyan Ayalaan Movie Direct OTT Release In Telugu? - Sakshi
Sakshi News home page

Ayalaan OTT Release: ఎటూ తేలని థియేటర్ రిలీజ్? ఇంతలోనే ఓటీటీ ప్రకటన..ఏమవుతోంది?

Published Sat, Jan 27 2024 6:36 PM

Is Ayalaan Movie Direct OTT Release In Telugu - Sakshi

సంక్రాంతి సినిమాల సందడి ఆల్మోస్ట్ అయిపోయింది. 'హనుమాన్' తప్పితే మిగతావన్నీ సైడ్ అయిపోయాయి. ఈ క్రమంలోనే రిపబ్లిక్ డే కానుకగా ఇతర భాషా, డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. ఓ స్టార్ హీరో మూవీకి మాత్రం అడ్డంకులు ఎదురయ్యాయి. ఇప్పుడా చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చేయబోతుందా అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటా సినిమా? ఏం జరుగుతోంది?

తమిళనాడులోని థియేటర్లలో సంక్రాంతికి 'కెప్టెన్ మిల్లర్', 'అయలాన్' చిత్రాలు విడుదలయ్యాయి. పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్స్ దక్కించుకున్నాయి. తెలుగులోనూ పండగకే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ థియేటర్ల దొరక్క జనవరి 26న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా నిన్న అంటే శుక్రవారం.. ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' థియేటర్లలోకి వచ్చింది. ఏవో ఆర్థిక సమస్యల కారణంగా 'అయలాన్' వాయిదా పడింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?)

అయితే 'అయలాన్' సినిమా తెలుగు వెర్షన్ విడుదలపై సందిగ్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే ఓటీటీ ప్రకటన వచ్చేసింది. ఈ మూవీ త్వరలో తమ ఓటీటీలో రిలీజ్ కానుందని సన్ నెక్స్ట్ ప్రకటించేసింది. అయితే ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ అని అంటున్నారు. కానీ అంతకు ముందే వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఒకవేళ తెలుగులో వచ్చేవారం.. అంటే ఫిబ్రవరి 2న థియేటర్లలో ఈ సినిమా రిలీజైనా సరే వారం పదిరోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేయొచ్చు. కాబట్టి తెలుగు వెర్షన్ విడుదల ఉంటుందా? లేదంటే శివకార్తికేయన్ 'అయలాన్' చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుందా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్? చూడాలి మరి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: చిరంజీవికి 'పద్మ విభూషణ్'.. ఈ అవార్డుతో పాటు ఏమేం ఇస్తారు?)

Advertisement
 
Advertisement
 
Advertisement