సంక్రాంతికి తెలుగు బరి నుంచి తప్పుకొన్న ఆ క్రేజీ సినిమా | Ayalaan Movie Telugu Version Postponed For Sankranthi 2024 | Sakshi
Sakshi News home page

పోటీకి రెడీ అయ్యారు.. చివరకొచ్చేసరికి చేతులెత్తేశారు

Published Mon, Jan 8 2024 7:34 PM | Last Updated on Mon, Jan 8 2024 8:09 PM

Ayalaan Movie Telugu Version Postponed For Sankranthi 2024 - Sakshi

ఈసారి సంక్రాంతికి బోలెడన్ని సినిమాలు రాబోతున్నాయి. తెలుగులోనే ఏకంగా ఐదు సినిమాలు రెడీ చేశారు. కానీ నిర్మాతలు, గిల్డ్ మధ్య పలు చర్చలు జరిగిన తర్వాత రవితేజ మూవీ వాయిదా పడింది. సరేలే నాలుగు చిత్రాలు ఉన్నాయి. వీటికి థియేటర్లు ఎలా సర్దుబాటు చేయాలా అని అందరూ తలలు బాదుకుంటుంటే.. డబ్బింగ్ సినిమా ఒకటి కూడా రిలీజ్ చేస్తామని అన్నారు. ఇప్పుడు దాన్ని కూడా వాయిదా వేయక తప్పలేదు.

ఈసారి సంక్రాంతి పండక్కి మహేశ్ 'గుంటూరు కారం'తో పాటు 'హను-మాన్', వెంకీ 'సైంధవ్', నాగ్ 'నా సామి రంగ' చిత్రాలు.. థియేటర్లలో విడుదల కానున్నాయి. అయితే వీటితో పాటు తమిళం నుంచి ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', శివకార్తికేయన్ 'అయలాన్' కూడా తొలుత రిలీజ్ చేస్తామని ప్రకటించేశారు. కానీ పరిస్థితి అర్థమయ్యేసరికి ధనుష్ మూవీ తప్పుకొంది. ఇక శివకార్తికేయన్‌ చిత్రాన్ని మాత్రం కచ్చితంగా జనవరి 12నే తీసుకొచ్చేస్తున్నారని అన్నారు.

(ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల గొడవ.. వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు!)

ఈ డబ్బింగ్ సినిమా నైజాం, ఉత్తరాంధ్ర హక్కుల్ని దిల్‌రాజు కొనడంతో.. తెలుగు డబ్బింగ్ రిలీజ్ ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు దీన్ని వాయిదా వేసినట్లు స్వయంగా దిల్‌రాజు చెప్పుకొచ్చారు. సరిపడా థియేటర్లలు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే సంక్రాంతి బరి నుంచి తప్పుకొన్న ధనుష్, శివకార్తికేయన్.. జనవరి 19 లేదా 26న తమ చిత్రాల్ని తెలుగులో రిలీజ్ చేసే అవకాశముంది.

'అయలాన్' సినిమా విషయానికొస్తే.. ఓ ఏలియన్ పొరపాటున భూమ్మీదకు వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో హీరోతో ఆ గ్రహాంతరవాసి స్నేహం చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అనేదే మెయిన్ స్టోరీ. ట్రైలర్ చూస్తుంటే బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే తమిళంలో సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి టాక్ పాజిటివ్‌గా వస్తే పర్లేదు. అదే తేడా కొట్టేస్తే మాత్రం తెలుగు వెర్షన్ కూడా దెబ్బేసే ఛాన్స్ ఉంటుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement